Allu Arjun: 1000 కోట్ల సినిమా మిస్ చేసుకున్న అల్లు అర్జున్.. చేసుంటే మరో పుష్ప అయ్యేది..?
Allu Arjun: పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు.. పుష్పాకు ముందు ఒక లెక్క అయితే పుష్పా తర్వాత మరో లెక్కగా మారాడు. అలాంటి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో సక్సెస్ అందుకున్నా కానీ ఈ సినిమా ఆయనకు కాస్త చేదు అనుభవాన్ని మిగిలించింది. పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా వచ్చినటువంటి అభిమానుల తాకిడీలో రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా తన కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
Allu Arjun who missed out on a 1000 crore film
దీంతో ఈ అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడమే కాకుండా సినీ ఇండస్ట్రీ అంతా ఆగమాగం అయిపోయింది. అలాంటి పుష్ప సినిమా రికార్డులు క్రియేట్ చేసినా ఆ ఆనందాన్ని అల్లు అర్జున్ పొందలేకపోయారని చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమానే కాకుండా దీనికంటే ముందు దీన్ని తలదన్నే ఒక సినిమా ఆఫర్ ఆయనకు వచ్చిందట. కానీ అల్లు అర్జున్ ఆ సినిమాను సున్నితంగా తిరస్కరించారని, ఆ తర్వాత ఆ చిత్రాన్ని బాలీవుడ్ హీరో చేసి అద్భుతమైన రికార్డు క్రియేట్ చేశారని తెలుస్తోంది. ఆ మూవీ ఏంటి ఆ వివరాలు చూద్దామా.. (Allu Arjun)
Also Read: Prabhas: ప్రభాస్ కి హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం ఆ డైరెక్టర్.. ఫ్యూచర్లో సినిమాలు చేయలేడా.?
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకరు అనుకున్న సినిమా మరొకరికి వెళుతూ ఉంటుంది. అలా వెళ్లిన సందర్భంలో ఆ సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని ఎందుకు మిస్ అయ్యానని హీరోలు బాధపడుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. అలా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు పొందిన బజరంగీ భాయిజాన్ అనే చిత్రం ముందుగా అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిందట. కానీ అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ కారణంగా సినిమా తిరస్కరించారు. దీంతో ఈ సినిమా సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళింది.
ఇందులో సల్మాన్ ఖాన్ హనుమంతుని భక్తుడిగా నటించి ఒక చిన్న పాప ప్రాణాలను కాపాడే వ్యక్తిగా కనిపిస్తాడు. అద్భుతమైన కథాంశంతో వచ్చిన ఈ మూవీ 90 కోట్ల బడ్జెట్ తో వచ్చి 320 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 922 కోట్లు రాబట్టి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు తిరగరాసింది. ఈ విధంగా అల్లు అర్జున్ 900 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాను మిస్ చేసుకున్నారని సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు ఊపందుకున్నాయి.(Allu Arjun)