Allu Arjun: అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్… రేవంత్ స్కెచ్ ?
Allu Arjun: అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప-2. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల అయింది. అయితే డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షోని నిర్వహించారు. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో నిర్వహించడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. అక్కడికి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి సినిమా చూడడానికి వచ్చారు. Allu Arjun

Allu Arjun will again arrest soon
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ని చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అందులో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. రేవతి కుమారుడు శ్రీ తేజ్ కూడా ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ విషయం పైన అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరోజు మొత్తం జైలు జీవితం గడిపిన అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చారు. Allu Arjun
Also Read: Tendulkar-Kambli: 70 వేలు రావాల్సిన పెన్షన్ 30 వేలే ఎందుకు వస్తున్నాయి.. సచిన్ కుట్ర చేశాడా ?
ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంటున్నారు. కాగా, అల్లు అర్జున్ బెయిల్ విషయం పైన సుప్రీంకోర్టుకు పోలీసులు వెళ్లారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగిందట. ఒకవేళ సుప్రీంకోర్టు కనక అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసినట్లయితే మళ్లీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు సంధ్య థియేటర్ కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని లేనిచో థియేటర్ ను సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని చెబుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. Allu Arjun