Orange Seeds: నారింజ పండు గింజలు తింటున్నారా.. అయితే డేంజర్ ?
Orange Seeds: చలికాలంలో నారింజపండు సీజన్ ప్రారంభమవుతుంది. నారింజ పండు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. చాలా మంది నారింజపండు జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. చిన్నపిల్లలు కూడా నారింజ పండును ఇష్టంగా తింటారు. ఇది కంటికి కలర్ ఫుల్ గా కనిపించడమే కాకుండా చాలా రుచిని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. నారింజ పండు తినడం వల్ల తరచుగా ఏర్పడే అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఎనీమీయాతో బాధపడుతున్న వారు నారింజపండు జ్యూస్ తాగడం వల్ల చాలా మంచిది. ఇందులో ఉండే పీచు శరీరంలోని జీర్ణశక్తిని పెంచుతాయి. నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధులను నయం చేస్తాయి. నారింజ రసం తాగినట్లయితే కంటి చూపు మెరుగుపడుతుంది. Orange Seeds
Amazing Benefits of Eating Orange Seeds
చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ పండు రసం రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తాయి. నారింజ పండు మాత్రమే కాదు దీనిలోని విత్తనాలు, తొక్క అన్ని కూడా ఉపయోగాలను చేకూరుస్తాయి. నారింజ విత్తనాలు చేదుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనారోగ్యం సంభవిస్తుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇది వాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. నారింజ విత్తనాలు తిన్నట్లయితే చాలా మంచిది. నారింజ విత్తనాలలో ఓలీక్, పాలిమైడ్, లినోనిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి అలసటను తగ్గించడానికి ఎంతో సహాయం చేస్తాయి. కాబట్టి నారింజ గింజలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. Orange Seeds
Also Read: Ambati Rambabu: రేవంత్ ప్రభుత్వానికి టాలీవుడ్ నుంచి డబ్బులు.. వైసిపి సెటైర్లు?
వీటిని తిన్నట్లయితే ఆరోగ్యానికి కావలసిన ఎన్నో విటమిన్లు పోషకాలు అందుతాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి. నారింజ తొక్కలను ఎండలో ఆరబెట్టి వాటిని పౌడర్ చేసుకొని వేడి నీటిలో కలుపుకొని తాగినట్లయితే సులభంగా బరువు పెరుగుతారు. నారింజ రసాన్ని మొటిమల మీద అప్లై చేస్తే సులభంగా మొటిమలు తగ్గిపోతాయి. మచ్చలు సైతం తొలగిపోతాయి. నారింజ గింజలను ఎండలో ఎండబెట్టి పొడి చేసి నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్యలు సులభంగా తొలగిపోతాయి. జుట్టు పొడవుగా పెరుగుతుంది. జుట్టు ఊడడం లాంటి సమస్యలు పోతాయి. నారింజ పండు చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి రెండు రకాలుగా చాలా మంచిది. కాబట్టి సీజన్ సమయంలోనే వీటిని తినడం చాలా మంచిదని నిపుణులు సూచనలు చేస్తున్నారు. Orange Seeds