Ambati Rambabu: రేవంత్ ప్రభుత్వానికి టాలీవుడ్ నుంచి డబ్బులు.. వైసిపి సెటైర్లు?
Ambati Rambabu: టాలీవుడ్ ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా గ్యాప్ వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఖండించేందుకు తాజాగా రేవంత్ రెడ్డి తో స్వయంగా భేటీ అయింది టాలీవుడ్ చిత్ర బృందం. హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ సమావేశం జరిగింది. Ambati Rambabu
Ambati Rambabu Comments On revanth meeting tollywood
ఈ సందర్భంగా ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్యలను రేవంత్ రెడ్డికి విన్నవించారు టాలీవుడ్ పెద్దలు. అయితే బెనిఫిట్ షో తో పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారట. అలాగే తెలంగాణ ప్రకృతి అందాలు అలాగే పథకాలకు సంబంధించిన.. అడ్వటైజ్మెంట్ సినిమా స్టార్లే చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారట. Ambati Rambabu
Also Read: Rahul Gandhi: రేవంత్ కు షాక్..పొన్నంకు రాహుల్ గాంధీ లేఖ ?
అయితే ఈ మీటింగ్ నేపథ్యంలో… వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన పోస్ట్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి…. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డబ్బులు వెళ్లినట్లు సెటైరికల్ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. సోఫా అందిందా అంటూ…. పుష్ప సినిమా సీన్ గుర్తు చేశారు అంబటి రాంబాబు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డబ్బులు వెళ్లినట్లు వైసిపి ట్రోలింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. Ambati Rambabu