Ambati Rayudu: చిక్కుల్లో పడ్డ రాయుడు.. లోకేష్, చిరంజీవి పబ్లిసిటీ కోసమే వచ్చారంటూ.?
Ambati Rayudu: నిన్న అనగా ఫిబ్రవరి 23న చాలామంది టీవీలకి అతుక్కుపోయారు. దానికి ప్రధాన కారణం ఇండియన్ పాకిస్తాన్ మ్యాచ్.. నిన్న ఇండియన్ పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా ఓడిపోతుందని ఐఐటి బాబా జోస్యం చెప్పిన సంగతి మనకు తెలిసిందే.దీంతో చాలామంది ఈ మ్యాచ్ ని ఆసక్తికరంగా చూశారు.పాకిస్తాన్ వాళ్లేమో ఐఐటి బాబా మాటలు నిజాం అవ్వాలని,ఇండియా వాళ్ళేమో ఆయన మాటలు అబద్దం అవ్వాలని ఇలా కోరుకున్నారు.

Ambati Rayudu in trouble
పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లో ఎప్పటికైనా ఇండియానే గెలుస్తుంది అని మరొకసారి ప్రూవ్ చేశారు మన ఇండియన్ క్రికెటర్లు. మ్యాచ్లో పాకిస్తాన్ పై ఇండియా గెలుపొందింది.దాంతో ఐఐటి బాబా తోక ముడుచుకున్నాడు. ఈ విషయం పక్కన పెడితే..ఇండియా పాకిస్తాన్ మ్యాచ్పై చాలామందికి చాలా రకాల ఆసక్తి ఉంటుంది. ఈ మ్యాచ్ ని దగ్గరుండి చూడాలని ఎంతోమంది అనుకుంటారు.అయితే మామూలు జనాలే కాదు సెలబ్రెటీలు కూడా ఈ మ్యాచ్ ను దగ్గరుండి చూడడానికి ఇష్టపడతారు. (Ambati Rayudu)
అలా దుబాయ్ లో జరిగే ఇండియన్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఏకంగా ఏపీ మంత్రి లోకేష్,మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్ ఇలా కొంతమంది సెలబ్రిటీలు మ్యాచ్ వీక్షించడం కోసం దుబాయ్ కి వెళ్లారు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెటర్ అంబటి రాయుడు కామెంటేటర్ గా మారారు. అయితే మధ్యమధ్యలో కామెంటేటర్ ల హవా నడుస్తుంది.కాబట్టి ఈ షో చూడడానికి వచ్చిన చిరంజీవి, లోకేష్,సుకుమార్ వంటి వారిపై అంబటి రాయుడు దుబాయ్ కి ఈ సెలబ్రిటీలందరూ మ్యాచ్ చూడడానికి వచ్చింది అంతా పబ్లిసిటీ కోసమే..

ఇలా మ్యాచ్ చూడడానికి వస్తే టీవీలలో ఎక్కువగా కనిపిస్తారనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారు.అంతా పబ్లిసిటీ కోసమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంబటి రాయుడు. ప్రస్తుతం అంబటి రాయుడు వ్యాఖ్యలపై చాలామంది మెగా ఫ్యాన్స్ తో పాటు ఇతరులు కూడా ఫైర్ అవుతున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దగ్గరుండి చూడాలని ఎవరికీ ఉండదు. అలా వారికి కూడా ఉండి ఉంటుంది. అందుకే వాళ్ళు మ్యాచ్ ను దగ్గరుండి చూశారు. కానీ నువ్వేమో పబ్లిసిటీ కోసం అని అంత నీచమైన మాటలు ఎలా మాట్లాడుతావు అంటూ ఆయన పై దుమ్మెత్తి పోస్తున్నారు.(Ambati Rayudu)