Ameesha Patel: ఆ హీరోతో అందమైన పిల్లల్ని కంటా..లేటు వయసులో అమీషా హాట్ కోరిక.?
Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా హ్యూజ్ ఫాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ..అయితే ఎంతో మంది అభిమానులు ఉన్న ఈ హీరోయిన్ ఇప్పటివరకు అయితే పెళ్లి చేసుకోలేదు. ఇక బాలీవుడ్ లో పెళ్లి చేసుకోని సెలబ్రెటీస్ లిస్టులో ఈ హీరోయిన్ కూడా ముందుంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ లేటు వయసులో హాట్ కోరిక అన్నట్లుగా ఆ హీరోని పెళ్లి చేసుకుని అందమైన పిల్లల్ని కంటాను అని సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంతకీ అమీషా పటేల్ ఎందుకు అలా మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం.
Ameesha Patel hot desire at a late age
బాలీవుడ్లో పెళ్లి చేసుకోని సెలబ్రిటీలలో అమీషా పటేల్ సల్మాన్ ఖాన్ లు కూడా ఉంటారు.అయితే ఈ ఇద్దరి కాంబోలో సినిమా వచ్చింది. ఈ సినిమా హిట్ కాక పోయినప్పటికీ ఈ జోడి మధ్య కెమిస్ట్రీ బాగుండడంతో వీరి జోడి కి మంచి గుర్తింపు లభించింది. అయితే తాజాగా కొంతమంది అమీషా పటేల్ కి ఎక్స్ ఖాతాలో కొంతమంది అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఆమె ఇచ్చిన ఆన్సర్లకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. చాలా మంది ట్విట్టర్ లో నన్ను మీరు సల్మాన్ ఖాన్ ఇద్దరు చాలా అందంగా ఉంటారు.(Ameesha Patel)
Also Read:Sridevi: చెల్లెలి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీదేవి నిజమేనా.?
మీ ఇద్దరు పెళ్లి చేసుకుని అందమైన పిల్లల్ని కనండి అని నాకు చెప్పేవారు. అయితే వాళ్ల మాటలకు నిజమే కావచ్చు అని నేను కూడా సమాధానం ఇచ్చాను.ఎందుకంటే సల్మాన్ ఖాన్ కూడా అందంగా ఉంటారు.అందుకే మీరు అనుకున్నది నిజమే కావచ్చు.. అందమైన ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడాన్ని ఈ లోకం కూడా ఇష్టపడుతుంది అంటూ నేను సమాధానం ఇచ్చాను అని ఆ ఇంటర్వ్యూలో అమీషా పటేల్ ఈ విషయాన్ని పంచుకుంది.
చూస్తుంటే అమీషా పటేల్ కి కూడా సల్మాన్ ఖాన్ మీద ఇష్టం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే అమీషా పటేల్ ఇలా మాట్లాడడంతో లేటు వయసులో అమీషా పటేల్ హాట్ కోరిక అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.ఇక మరి కొంతమందేమో ఇద్దరికీ పెళ్లి కాలేదు కాబట్టి సోషల్ మీడియా జనాలు అనుకున్నట్టే వీళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే బాగుంటుంది అని అమీషా పటేల్ మాట్లాడిన మాటలకి సోషల్ మీడియా వేదిక కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి అమీషా పటేల్ కోరుకున్నట్టు సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది.(Ameesha Patel)