Amla Health Benefits: ఉసిరికాయ రోజూ తింటే.. ఎన్ని లాభాలో ?
Amla Health Benefits: ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఉసిరి రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి కావాల్సినన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అయితే ప్రతిరోజు ఉదయం పూట ఉసిరికాయ రసాన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఉసిరికాయలో కాపర్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి అధికంగా ఉంటాయి.
Amla Health Benefits for Human
ఉసిరికాయ రసాన్ని ఉదయం పూట తాగినట్లయితే చర్మ సమస్యలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై ఉన్న మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ముడతలు క్రమక్రమంగా తగ్గుతాయి. ఉసిరికాయ చర్మానికే కాకుండా జుట్టును ఆరోగ్యంగా తయారు చేస్తుంది. జుట్టు బలంగా, ఒత్తుగా తయారవుతుంది. జుట్టు ఊడడం లాంటి సమస్యలు తొలగిపోతాయి. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉసిరి రసం జీవక్రియను పెంచడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. ఉసిరి రసాన్ని ప్రతిరోజు తాగినట్లయితే బరువు సులభంగా తగ్గుతారు.
ఉసిరి రసం శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తుంది. ఉసిరి రసం శరీరంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతాయి. అయితే ఉసిరి రసాన్ని చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసంలో రెండు ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క, 5 కరివేపాకులను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా చేసినట్లయితే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు.