Amla: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి చాలామంది అనేక రకాల ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఉసిరికాయను తింటూ ఉంటారు. అయితే ఉసిరికాయలో చాలా రకాల పోషకాలు ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యనిపురము చెబుతున్నారు. ఉసిరికాయతో ఉండే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… పెద్దలు ఉసిరిని అమృత ఫలం అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయని తినడం వల్ల జీర్ణ క్రియను మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. Amla
Amla Health Benefits in Telugu
ఉసిరికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ వంటి మిశ్రమాలు జీర్ణక్రియ, జీర్ణశక్తిని పెంచడానికి, గుండె సమస్యలను నివారించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా శరీరంలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఉసిరికాయ తినడం వల్ల యాసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత ఉసిరికాయ తినడం వల్ల చాలా మంచిది. ఇది జీర్ణక్రియకు కూడా చాలా బాగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉసిరికాయ చాలావరకు జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయ తినడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. Amla
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ది రియల్ హీరో… రోడ్డుపైనే అధికారులను కడిగేస్తున్నాడు ?
జుట్టు మూల మూలాలను బలపరుస్తుంది. చాలావరకు ఉసిరికాయను షాంపూలో వాడుతూ ఉంటారు. తలకు పెట్టుకునే నూనెలో కూడా ఉసిరికాయను వాడుతూ ఉంటారు. అది మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఉసిరికాయ ప్రతిరోజు తినడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ప్రస్తుత కాలంలో చాలావరకు గుండె వ్యాధులు వస్తున్నాయి. ఉసిరికాయ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. Amla
ఇందులో ఫైబర్, ఆంటీ యాక్సిడెంట్లు, విటమిన్స్ ఉండడం వల్ల గుండె చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఉసిరికాయ తినడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉండడం వల్ల దీనిని తినడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా కంటి చూపు వంటి సమస్యల నుంచి కూడా ఉసిరికాయ కాపాడుతుంది. ప్రతిరోజు ఉసిరికాయ తినడం వల్ల కళ్ళకు ఎంతో మేలు కలుగుతుంది. కంటి చూపును మెరుగుపరచడానికి ఉసిరికాయ చక్కగా సహాయపడుతుంది. ముఖ్యంగా రెటీనా, డిజార్డర్స్, క్యాటరాక్ట్ వంటి కంటి సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఉసిరికాయ సహాయం చేస్తుంది. Amla