Amla: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో మనమంతా పొల్యూషన్ వాతావరణం కారణంగా కలుషితమైన ఆహారాన్ని తిని అనేక రకాల వ్యాధులను తెచ్చుకుంటున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో భాగంగానే ప్రతిరోజు ఒక్క ఉసిరికాయని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ఉసిరికాయని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. Amla
Amla is a check for 100 diseases if you eat one a day
తద్వారా మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. పొట్ట పెరగకుండా కాపాడుతుంది. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల కొవ్వును కరిగిస్తుంది. ఉసిరికాయ బరువు తగ్గడానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది ఇందులో కొవ్వు కరిగించే పదార్థాలు ఉండడం వల్ల శరీరంలోని కొవ్వు పెరగకుండా కాపాడడంతో పాటుగా…. కొవ్వు పెరగకుండా చూస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాని ద్వారా మనం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాం. అందువల్ల సులభంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. Amla
Also Read: Moong dal: పెసరపప్పు తింటున్నారా? అయితే జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి?
ముఖ్యంగా ఉసిరికాయను బీపీ, షుగర్ పేషెంట్లు తప్పకుండా తీసుకోవాలి. ఇందులో విటమిన్స్ ఉండడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ప్రతిరోజు ఉసిరికాయ తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. చాలా యాక్టివ్ గా తయారవుతారు. ఉసిరికాయ శరీరానికే కాకుండా జుట్టు పెరగడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్లు, ఆంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు ఊడిపోకుండా ఉండడానికి సహకరిస్తుంది. Amla
తద్వారా జుట్టు బలంగా, ఒత్తుగా, మృదువుగా తయారవుతుంది. ఇక ఈ ఉసిరికాయను పచ్చిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పచ్చిగా తినడం నచ్చనివారు జ్యూస్, జామ్, చట్ని రూపంలో ఎలా అయినా తయారు చేసుకుని ఈ ఉసిరికాయని తినవచ్చు. ఎలా అయినా సరే రోజులో ఒక్క ఉసిరికాయనైనా తప్పకుండా తినాలి. ఇది పుల్లగా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. చిన్నపిల్లలకు కూడా ఉసిరికాయను తినిపించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Amla