Telangana: తెలంగాణకు నమో భారత్‌తో పాటు అమృత్ భారత్ రైళ్లు?
Telangana: రెండు రోజుల కిందట… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో… శనివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సామాన్యులకు మేలు జరిగేలా బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే ఈసారి రైల్వే ప్రాజెక్టులలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలకు న్యాయం జరిగినట్లు తెలుస్తోంది.
Amrit Bharat trains along with Namo Bharat to Telangana
రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డ్ స్థాయి కేటాయింపులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీకి రూ.9,417 కోట్లు కేటాయించినట్టు తెలిపారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఇక తెలంగాణకు రూ.5,337 కోట్లు నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం… ఈ మేరకు ప్రకటన చేసింది.
కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్‌ని ఏర్పాటు చేస్తామన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్….త్వరలోనే తెలంగాణకు నమో భారత్‌తో పాటు అమృత్ భారత్ రైళ్లు రానున్నట్లు ప్రకటన చేశారు. అటు.. ఏపీలో ప్రస్తుతం రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని.. వివరించింది కేంద్ర ప్రభుత్వం. 1560 కి.మీ.కొత్త రైల్వే లైన్‌ను ఏర్పాటు చేశామని తెలిపిన అశ్వినీ వైష్ణవ్….. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.