Heroine: 15 ఏళ్ల కూతుర్ని పెట్టుకొని బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న నటి.?

Heroine: కొంతమంది హీరోయిన్లు వయసు పెరిగి పెళ్లీడుకొచ్చిన కూతుర్లు కొడుకులు ఉన్నా కూడా భర్తతో విడిపోయాక పెళ్లిళ్లు చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ హీరోయిన్ కూడా 15 ఏళ్ల కూతుర్ని పెట్టుకొని పెళ్లి చేసుకుంటానంటోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఇప్పుడు ఎందుకు కలుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. ఈ నటికి 15 ఏళ్ల కూతురు మాత్రమే కాదు 21 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది.
An Heroine who wants a boyfriend
ఆవిడేనండి హీరోయిన్ రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని నాకు కూడా బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది.నా జీవితంలో వ్యక్తిగతంగా చూసుకుంటే నాకు రెండో పెళ్లి ఎంతో ముఖ్యం అంటూ ఆమె మాట్లాడిన మాటలు చాలామందికి ఆశ్చర్యం కలగజేసాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ తో విడాకులయ్యాక రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించింది.(Heroine)
Also Read: Malavika: తండ్రి వయసున్న హీరో తో హీరోయిన్ ఆ పనులు.. వెనుకోసుకొచ్చిన వైనం!!
ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కానీ సడన్గా ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.దానికి ప్రధాన కారణం తన ఇద్దరు పిల్లలే అని చెబుతోంది. రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో రేణుదేశాయ్ మాట్లాడుతూ.. నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది నిజమే.కానీ నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి రెండో పెళ్లి వద్దనుకున్నాను.నేను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అది నా పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది.

నేను వాళ్లను పట్టించుకోకుండా ఉంటే అటు తండ్రి లేకుండా తల్లి లేక వాళ్ళు అనాధలుగా మారిపోతారు. అందుకే నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాకు పెళ్లి అవసరం లేదని అనుకున్నాను.అయితే నా పిల్లలిద్దరూ అమ్మ నీకు కూడా ఓ తోడు కావాలి.నువ్వు పెళ్లి చేసుకో అని అంటూ ఉంటారు.ప్రస్తుతం నా కూతురు నా కొడుకు ఇద్దరూ పెద్దవాళ్లయ్యారు.బహుశా నా కూతురికి 18 ఏళ్ల వయసు వచ్చాక నేను రెండో పెళ్లి చేసుకుంటానేమో అంటూ రెండో పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రేణు దేశాయ్.(Heroine)