Sakhi Movie: బ్లాక్ బస్టర్ “సఖి” మూవీ ని మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో.?

Sakhi Movie: ఎప్పుడు ఎవరి స్టార్ ఏ టైంకు తిరుగుతుందో చెప్పలేం.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్లుగా మారతారు.. మరి కొంతమంది పాతాళానికి పడిపోతారు.. అలా అనుకోకుండా వచ్చినటువంటి ఒక చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందడమే కాకుండా వారు కూడా స్టార్డం పొందారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే సఖి.. కామన్ గా వచ్చినటువంటి ఈ మూవీ సంచనల విజయాన్ని అందుకొని ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి పేరు తీసుకువచ్చింది.

 An unlucky hero who missed the blockbuster Sakhi Movie

An unlucky hero who missed the blockbuster Sakhi Movie

అలాంటి సఖి మూవీని అప్పట్లో ఒక స్టార్ హీరో మిస్ చేసుకున్నారట.. చిన్న సినిమాలో నేను చేస్తానా అంటూ వదిలేసుకున్నారట.. కానీ అదే చిత్రం అద్భుతమైన హిట్ సాధించడంతో ఎందుకు వదిలేసానని చాలా బాధపడ్డారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఏప్రిల్ 14, 2000 సంవత్సరమది.. తమిళ చిత్రం ‘అలై పాయుతే’ అనే తమిళ చిత్రాన్ని డబ్బింగ్ చేసి మణిరత్నం తెలుగులో సఖి పేరుతో తెరకెక్కించారు. (Sakhi Movie)

Also Read: NTR And Hrithik Roshan: చరణ్ తో సెట్ అయినట్లు హృతిక్ తో వర్కౌట్ అయ్యేనా తారక్?

ఇందులో హీరో మాధవన్ హీరోయిన్ గా షాలిని నటించారు. ఇక స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాంటి ఈ చిత్రం విడుదలైన మొదటి రెండు రోజులు కాస్త డల్ గా ఉన్న ఆ తర్వాత కొన్ని వారాలపాటు హౌస్ఫుల్ బోర్డులతో సంచలనం సృష్టించింది. 100 రోజులకు పైగా టికెట్లు దొరకలేదు అంటే ఈ చిత్రం ఎలాంటి రికార్డు సాధించిందో అర్థం చేసుకోవచ్చు.. ఆ తర్వాత ఈ సినిమాను హిందీలో కూడా పాతియా పేరిట రీమేక్ చేశారు. అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.

 An unlucky hero who missed the blockbuster Sakhi Movie

అయితే ఈ సినిమాలో మాధవన్ కంటే ముందు మణిరత్నం బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ హీరోయిన్ కాజోల్తో చేద్దామనుకున్నారట. వారికి కథ చెప్పగానే క్లైమాక్స్ నచ్చలేదని పక్కన పెట్టేసారట. దీంతో ఈ చిత్రం మాధవన్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇక 2000 సంవత్సరంలో సఖి చిత్రం బెస్ట్ చిత్రంగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత మాధవన్ ను మరియు శాలిని పేర్లు కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో మార్మోగిపోయాయి.(Sakhi Movie)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *