Anantha Sriram: కల్కి సినిమాపై మండిపడ్డ అనంత శ్రీరామ్.. ఇది ఓ సినిమానేనా.?
Anantha Sriram: ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రామాయణ మహాభారత ఇతిహాసాలను బేస్ చేసుకుని వస్తున్నాయి. అయితే ఈ సినిమాల్లో వారి పాత్రలు పండడం కోసం చరిత్రనే మారుస్తూ పాత్రలను వక్రీకరిస్తూ నటిస్తున్నారు. దీనిపై మంచిని చెడుగా చెడును మంచిగా చూపిస్తూ చరిత్రను మరో రకంగా చూపిస్తే రాబోవు కాలంలో అదే నిజమైన చరిత్ర అని నమ్మే అవకాశం ఉంది. కాబట్టి చరిత్రలో రామాయణం, మహా భారతం ఏ విధంగా ఉందో ఆ విధంగానే పాత్రలు చేస్తే బాగుంటుందని సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. అయితే ఈయన విజయవాడలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం అనే బహిరంగ సభకు హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
Anantha Sriram got angry over the movie Kalki.
చాలామంది ఇండస్ట్రీలలో హిందూ ధర్మాన్ని అవమానించేలా సినిమాలు తీస్తున్నారని, కేవలం సంపాదనే ద్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా చాలా సినిమాల్లో గురూజీలను, స్వామీజీలను పోలిన పాత్రలు చేస్తూ ఆమానపరుస్తున్నారని రీసెంట్గా వచ్చినటువంటి కల్కీ చిత్రంలో మహాభారతాన్ని పూర్తిగా మార్చేసి కర్ణుడు గొప్పవాడు అయినట్టు చూపించారని చెప్పారు. మరి నిండు సభలో ద్రౌపది చీరలాగి అవమానిస్తున్నా కానీ కర్ణుడు సైలెంట్ గా ఎందుకు ఉన్నాడని,కర్ణుడు సూర్యుడు నుండి అర్జునుడు అగ్నిదేవుడు నుండి వచ్చాడని, కర్ణుడు గొప్ప అంటే హిందూ ధర్మం ఒప్పుకుంటుందా.(Anantha Sriram)
Also Read: Trisha: సీఎం అవ్వాలంటున్న త్రిష.. మామూలు ట్రిస్ట్ ఇవ్వలేదుగా.?
కర్ణుడి పాత్రను గొప్పగా చేసి కల్కి సినిమాలో చూపించారని మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఉండి ఎవరు నోరు విప్పడం లేదని ఆ సినిమా చూసి నేను సిగ్గుపడుతున్నానని , హిందూ ధర్మాన్ని అవమానపరిచినట్టు చూపించారని చెప్పారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీ తరపున నేను మీకు స్వారీ చెబుతున్నానని అన్నారు.. రాముడు కృష్ణుడు గురించి వర్ణిస్తూ సిరివెన్నెల రాసిన పాటలను స్ఫూర్తిగా తీసుకోండి అని అన్నారు. అలాగే తిరుపతి ఆలయాన్ని విమర్శిస్తూ ఉన్నా కానీ కొంతమంది నాయకులు, నిర్మాతలు సైలెంట్ గా ఉంటున్నారు అని తెలియజేశారు.
డబ్బులు సంపాదించడం కోసం హిందూ ధర్మాన్ని కించపరుస్తూ సినిమాలు తీస్తే హిందువులే బహిష్కరించాలని, మనం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారని మండిపడ్డారు. అలాంటి సినిమాలు వస్తే తప్పకుండా బహిష్కరించి తగిన గుణపాఠం చెబితేనే ఇంకోసారి చరిత్రను వక్రీకరించే సినిమాలు తీయరని దీనికోసం హిందువులంతా ఏకం కావాలని అన్నారు. ప్రస్తుతం అనంత శ్రీరామ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి చాలామంది హిందువులు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Anantha Sriram)