Anasuya: టాలీవుడ్ లో యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టి నటిగా బిజీ అయిపోయింది అనసూయ. సోషల్ మీడియాలో తన ఫోటోషూట్లతో, గ్లామర్ డ్రెస్సింగ్ తో రచ్చ రచ్చ చేస్తూ కుర్ర కారు ని ఫిదా చేస్తుంది. ఫ్యాషన్ కు వయసు అడ్డం కాదని చాటి చెబుతూ ఇప్పటికీ గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ నెటిజెన్ ల ఆదరణ దక్కించుకుంటుంది. కొంతమంది ఈ వయసులో ఈ అందాల ప్రదర్శన ఏంటి అని ట్రోలింగ్ చేసినా కూడా వాళ్లతో వాదిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతుంది.
Anasuya about her dressing son comments
ఏ సందర్భంలోనూ తగ్గనట్లుగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు విమర్శలకు సమాధానాలు ఇస్తూ ముందుకు వెళుతుంది. ఒకటి రెండు సందర్భాల్లో ఆమె కన్నీరు పెట్టుకొని తిరిగి పుంజుకొని మళ్లీ తన పని తాను చేసుకుంటూ పోయేది.. తనమీద ఎన్ని నెగటివ్ కామెంట్లు వచ్చిన ఎంతమంది విమర్శలు చేసిన అవేవీ పట్టించుకోకుండా సినిమాలు టీవీలు అంటూ ముందుకు వెళ్ళింది. ఆమె డాన్స్ గురించి, అందాల ప్రదర్శన గురించి, ప్రవర్తన గురించి ఇప్పటిదాకా చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే దీనిపట్ల ఎవరో ఆమెను ఓ ప్రశ్న అడగగా తన డ్రెస్సింగ్ తన ఇష్టమని ఆమె బదులు చెప్పింది.
Also Read: Nani: దసరా పేరు చెప్పుకుని.. ఇంకెన్నేళ్లు లాగుతావు నాని!!
సినిమా డిమాండ్ చేస్తే నటిగా ఏదైనా చేయాలి అని ఆమె చెప్పింది. తన డ్రెస్సింగ్ గురించి సొంత వాళ్లే విమర్శిస్తే కొంచెం బాధగా ఉంటుంది అని ఆమె చెప్పింది. తన కొడుక్కి తన డ్రెస్సింగ్ అసలు నచ్చదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. నడుం పైకి టాప్ వేసుకుంటే తన కొడుకుకి నచ్చదని, ఫుల్ టాప్ వేయమని అంటాడని ఆమె చెప్పింది. ఈ విషయంలో కొడుక్కి ఎలాంటి సమాధానం చెప్పిందో అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కొడుకుల డ్రెస్ విషయంలో తాను వేలు పెట్టనని షాపుకు తీసుకువెళ్లి నచ్చింది తీసుకోమని చెబుతానని ఆమె చెప్పింది. ఏదేమైనా అనసూయ కొడుకు పట్ల కూడా ఈ విధంగానే వ్యవహరించడం కొంతమందిని ఆశ్చర్యపరిచింది.