Anchor Jhansi: పెళ్లీడుకొచ్చిన కూతుర్ని పెట్టుకొని యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి నిజమేనా..?
Anchor Jhansi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యాంకర్లు అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది సీనియర్ యాంకర్ సుమ మాత్రమే. అయితే ఈమెకంటే ముందు ఇండస్ట్రీలో యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో ఝాన్సీ మొదటి స్థానంలో ఉంటారు. అప్పట్లో ఇండస్ట్రీలో ఏ షో జరిగిన దానికి యాంకర్ గా ఝాన్సీ ఉండేది. ఈమె యాంకర్ గా వచ్చింది అంటే ఆ ప్రోగ్రాం తప్పనిసరిగా సక్సెస్ అవ్వడమే, కాకుండా నవ్వులు పూయిస్తుంది. అలా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ చివరికి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగింది.
Anchor Jhansi second marriage is it true
ఆమె నటన తీరు చాలా డిఫరెంట్ గా ఉండడంతో అనేక ఆఫర్లు వచ్చాయి, దీంతో స్టార్ నటిగా మారిన ఝాన్సీ ఆ తర్వాత మరో నటుడు జోగి నాయుడును ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంవత్సర కాలం పాటు బాగానే కలిసి ఉన్నారు ఇంతలో వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే విడిపోయిన తర్వాత జోగి నాయుడు తన కూతురిని కనీసం వారానికి ఒకసారి అయినా తనకు చూపించాలని బ్రతిమిలాడిన ఆమె ఒప్పుకోలేదని నాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.(Anchor Jhansi)
Also Read: Heroine: కుక్క బిస్కెట్లు తింటున్న హీరోయిన్.. లిప్ లాక్ లకి నో అంటున్న హీరో..?
చివరికి ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు. ఝాన్సీ మాత్రం తన కూతుర్ ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, పై చదువులు కూడా చదివించింది. ఆమె పేరు ధన్య. ప్రస్తుతం22 సంవత్సరాల ధన్య చూడటానికి హీరోయిన్ కంటే అద్భుతంగా కనిపిస్తోంది. అయితే తాజాగా ఝాన్సీ తన కూతురితో కలిసి ఒక షోకు హాజరై అసక్తికరమైన విషయాలు చెప్పింది.. ఈ సందర్భంగా యాంకర్ ధన్యను మీరు ఏం చేయబోతున్నారు అని ప్రశ్నించగా..
నాకు మణిరత్నం సినిమాలో నటించాలని ఉందని హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి వస్తానని చెప్పింది. అంతేకాదు యాంకర్ ఝాన్సీని మీరు రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారని ప్రశ్నించగా.. ఝాన్సీ కాస్త కోపానికి వచ్చినట్టు ఫేస్ పెట్టి సమాధానం ఇచ్చినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. ప్రస్తుతం వారి మధ్య జరిగినటువంటి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఝాన్సీ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింటా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.(Anchor Jhansi)