Anchor Pradeep: ఆ హీరోయిన్ తో ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాసిన యాంకర్ ప్రదీప్.?
Anchor Pradeep; తెలుగు ఇండస్ట్రీలో మేల్ యాంకర్స్ లో అత్యంత ఆదరణ పొందిన యాంకర్ ప్రదీప్.. ఇండస్ట్రీలో ఎలాంటి ఈవెంట్ అయినా కానీ తప్పనిసరిగా యాంకర్ ప్రదీప్ ఉండాల్సిందే. సమయానికి తగ్గ పంచులతో ఏ షోను అయినా రక్తి కట్టించే అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి ప్రదీప్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, సరిగమప వంటి షోలు చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కు సంపాదించుకున్నారు..
Anchor Pradeep love letter to that heroine
ఇంకా ఇండస్ట్రీలో యంగ్ యాంకర్ గా, హీరోగా దూసుకుపోతున్న యాంకర్ ప్రదీప్ చేసే షోలకి హీరోయిన్స్ వచ్చినప్పుడు మరింత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగానే ఆయన అనుపమ పరమేశ్వరన్ కు ఏకంగా ప్రపోజ్ చేసి లవ్ లెటర్ కూడా రాశారు.. మరి వివరాలు ఏంటో చూద్దామా..ప్రదీప్ తన జీవితంలో మొదటిసారి లవ్ లెటర్ రాశారట. అది కూడా స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరానికే.. (Anchor Pradeep)
Also Read: Meena: మీనా తో రెండో పెళ్లికి రెడీ.. నటుడు షాకింగ్ కామెంట్స్.?
అఆ చిత్రం ద్వారా ఆడియన్స్ ని ఎంతో మెస్మరైజ్ చేసినా అనుఫమా పరమేశ్వరన్, తాజాగా టిల్లు స్క్వేర్ తో బోల్డ్ బ్యూటీగా మారిపోయింది. అలాంటి ఈమె కొంచెం టచ్ లో ఉంటే చెబుతా అనే షోకు హాజరైంది.. ఈ షో సందర్భంగా ఆమె నాకు ఎవరు కూడా ఎఫర్ట్ పెట్టి లవ్ లెటర్ రాయలేదని, ఏదో తుతూ మంత్రంగా రాశారని చెప్పుకొచ్చింది. వెంటనే రియాక్ట్ అయినటువంటి ప్రదీప్ ఆమెకు అక్కడే ఒక లవ్ లెటర్ రాశాడు. ఆ లెటర్ ని ఆమెపై గులాబీ పూలు చల్లుతూ అందించాడు..
” ప్రియమైన అను ప్రేమతో మీ ప్రదీప్ మీ నవ్వు అద్భుతం, మీ చూపు, నడక అద్భుతం, మొత్తానికి మీరే అద్భుతం, ఒక్క ఛాన్స్ ఇస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానంటూ ప్రపోజ్ చేసి లెటర్ ఇచ్చాడు. దీంతో అనుపమ థాంక్యూ సో మచ్ ది మోస్ట్ వండర్ ఫుల్ లవ్ లెటర్ అంటూ మాట్లాడింది. దీంతో ప్రదీప్ చాలా సంబరపడిపోయాడు. ఈ విధంగా షో లోని అనుపమాకు లవ్ లెటర్ రాసి ప్రపోజ్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Anchor Pradeep)