HCU: సీఎం రేవంత్ రెడ్డి పై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు ?
HCU: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా… మారిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల గురించి వివాదం కొనసాగుతోంది. అయితే ఈ భూములను తీసుకుంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే చెట్లను నరికి వేసే ప్రయత్నం చేస్తోంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత విద్యార్థుల నుంచి అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తోంది.

Andhra Jyothi Radhakrishna’s sensational comments on CM Revanth Reddy HCU
దీంతో సుప్రీంకోర్టుకు కూడా ప్రతిపక్షాలు వెళ్ళాయి. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఊహించని షాక్ ఇచ్చారు. వివాదాస్పద భూములలో జింకలు అలాగే నెమళ్లు ఉన్న విషయం నిజమే అయితే వాటిని… పార్కులకు తరలించి ఆ తర్వాత భూమిని చేదును చేసి ఉండాల్సింది అంటూ చురకలాంటించారు ఏబీఎన్ రాధాకృష్ణ.
Rashmika: రష్మిక ఆ తెలుగు హీరోని కూడా బకరాని చేసిందా..?
కానీ ఆ అలా చేయకుండా లేడీ కి లేచిందే పరుగు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం వివాదంగా ఇంత దూరం వచ్చిందని ఫైర్ అయ్యారు. చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చిందని… ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది.
Kareena Kapoor: వారానికి 5 సార్లయినా కావాలి.. కరీనాకపూర్ హాట్ కామెంట్స్..?