AP Budget 2025: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్… ఆ కుటుంబాలకు 25 లక్షలు
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు… కొనసాగుతున్నాయి. 3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ గురించి వివరంగా చెప్పారు. అదే సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక విధ్వంసం జరిగిందని వైసీపీని ఏకీపారేశారు.

Andhra Pradesh Budget Analysis
సామాన్యుల సంతోషమే అలాగే రాజు సంతోషం అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అంతేకాదు ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త కూడా చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. ఈ ఏడాది కొత్త పథకం ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 25 లక్షల ఆరోగ్య భీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మధ్య తరగతి అలాగే పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈ స్కీం తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. దీనివల్ల పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. అలాగే ఆరోగ్య శాఖకు 19264 కోట్లు కేటాయించడం జరిగింది.