Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం క్రెడిట్ వెంకటేష్ కి కాదు ఆ హీరోకే..?

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు అంటే ఎంతటి స్టార్డమ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా ఉన్నాడు మహేష్ బాబు. కేవలం సినిమా షూటింగ్స్ తన ఫ్యామిలీ తప్ప ఇంకో విషయంలో వేలు పెట్టరు. అలాంటి మహేష్ బాబు టాలెంట్ ఉన్న వ్యక్తులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారికి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్నటువంటి అనిల్ రావిపూడికి ఒక మంచి ఆలోచన ఇచ్చారట.

Anil Ravipudi interesting comments on sankranthiki vasthunnam

Anil Ravipudi interesting comments on sankranthiki vasthunnam

ఆ ఆలోచన నుంచే వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం.. ఆయన వల్లే ఈ సినిమా చేశానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి అన్నారు..మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. మహేష్ బాబు భగవంతు కేసరి, చేస్తున్న సమయంలో నన్ను చూశారు.. ఆయన అందిస్తున్న కామెడీ చూసి కామెడీ జానార్ లో సినిమా చేస్తే సూపర్ హిట్ అవుతుందని చెప్పారు.. దీంతో ఎంతో ఆలోచించినా అనిల్ రావిపూడి ఆ దిశగా అడుగులు వేశారు.. ఇందులో నుంచి పుట్టిందే ‘సంక్రాంతి వస్తున్నాం’.. (Anil Ravipudi)

Also Read: Thalapathy 69: వచ్చే ఏడాది సంక్రాంతి ని టార్గెట్ చేసిన విజయ్ దళపతి!!

అలా 45 నిమిషాల పాటు మాట్లాడి ఇందులో స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉండాలి అనేదానిపై హింట్ ఇచ్చారు.. దాన్ని పట్టుకొని అనిల్ రావిపూడి అద్భుతమైనటువంటి కథను తయారుచేసి కసిగా ఈ సినిమాను తీసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించేలా చేశారని చెప్పవచ్చు. ఫుల్ కామెడీ లెంత్ తో వచ్చినటువంటి ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచి అద్భుతమైన హిట్ సాధించింది..

Anil Ravipudi interesting comments on sankranthiki vasthunnam

ఈ సినిమాతో పాటు పోటీగా వచ్చిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలను వెనక్కి నెట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అలాంటి ఈ చిత్రం ఇప్పటివరకు 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరహో అనిపించింది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటన మరింత మెప్పించింది అని చెప్పవచ్చు. ఈ విధంగా సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ముందు ముందు తెలుస్తుంది.(Anil Ravipudi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *