Anil Ravipudi: రెమ్యూనరేషన్ లో వెంకీనే మించిన అనిల్ రావిపూడి.. అంత తీసుకున్నారా..?
Anil Ravipudi: ఈ సంక్రాంతి పండక్కి ప్రజలను కడుపుబ్బా నవ్వించిన చిత్రాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి స్థానంలో ఉంది. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ తో వచ్చినటువంటి ఈ చిత్రం పాటల నుంచి మొదలు ప్రతి ఒక్కటి అత్యద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటికే ఎన్నో కామెడీ చిత్రాలను చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరింత హైప్ పెంచుకున్నారు..
Anil Ravipudi is more than Venky in remuneration
ఈ సినిమా ద్వారా సంక్రాంతి పండుగను ప్రేక్షకులంతా ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రమైనటువంటి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలను దాటి ఈ సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు రోజుల్లో అద్భుత కలెక్షన్స్ రాబట్టి సక్సెస్ అందుకున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నారట. వెంకటేష్ కంటే ఈయనకి ఎక్కువ పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత తీసుకున్నారు ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ( Anil Ravipudi)
వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి అనే చిన్న పాయింట్ తో సినిమా మొత్తం కామెడీ సృష్టించారు. ఇక సాంగ్స్ విషయానికి వస్తే అద్భుతమైన హిట్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక మొత్తానికి ఈ సినిమా ఎక్కడ కూడా బాగాలేదు అని చెప్పడానికి లేదు. అలాంటి ఈ చిత్రం చేయడం కోసం అనిల్ రావిపూడి 15 కోట్లు అమౌంట్ తీసుకున్నారట. సినిమాకి ముందే 10 కోట్లు తీసుకొని సినిమా సక్సెస్ అయితే ఇంకో ఐదు కోట్లు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారట.
ఈ చిత్రానికి వెంకటేష్ 10 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి వెంకటేష్ కంటే అనిల్ రావిపూడికే ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఎక్కువ అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ విధంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అద్భుతంగా దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఈ సినిమా దెబ్బతో అనిల్ రావిపూడి పేరు ఇంకెక్కడికో వెళ్లిపోయింది.( Anil Ravipudi)