Anil Ravipudi: సంక్రాంతి కి వస్తున్నాం కలెక్షన్స్ ఫేక్ కావు.. – దర్శకుడు అనిల్ రావిపూడి!!
Anil Ravipudi: బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతి కి వస్తున్నాం’ తో ఘన విజయం సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ₹200 కోట్ల మార్కును దాటి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వసూళ్లు రాబడుతుంది. కామెడీ, ఎమోషన్, హ్యూమర్ మిక్స్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
ప్రెస్‌మీట్ సందర్భంగా, సంక్రాంతి బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రామాణికత గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అనిల్ రావిపూడి పూర్తి నమ్మకంతో తమ గణాంకాలు నిజమైనవేనని తెలిపారు. ప్రేక్షకుల నుండి వచ్చిన అపారమైన స్పందన ఈ కలెక్షన్లకు నిదర్శనం అని అన్నారు. బాక్సాఫీస్ సక్సెస్‌ను పారదర్శకంగా చూపించడం, ఇలాంటి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లకు మరింత ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
తెలుగు సినిమాల్లో కామెడీ మరియు ఎమోషన్ మధ్య సరైన బ్యాలెన్స్ ఉంటే మాత్రమే మంచి విజయం సాధించగలమని అనిల్ అభిప్రాయపడ్డారు. అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండే సినిమాలు తప్పకుండా భారీ హిట్ అవుతాయని చెప్పారు. ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు మరింత పెరగాలి అనే ఉద్దేశ్యంతోనే సంక్రాంతినికి వస్తున్నాం సినిమా ను తీర్చిదిద్దినట్లు తెలిపారు.
ఈ విజయంతో, అనిల్ రావిపూడి తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్‌లకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు. ఆయన కథన శైలి, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రత్యేకత, బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇవ్వగల సమర్థతతో టాలీవుడ్‌లో అతను ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకరిగా మారారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అందరి చూపు ఉంది.