Anil Ravipudi: కత్తిలాంటి ఫిగర్ పై కన్నేసిన అనిల్ రావిపూడి.. వచ్చే జన్మలో ఆమెలాగే..?
Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెనక్కి వెళ్తున్న కొద్ది కొత్తనీరు వస్తుందని చెప్పడానికి చాలామంది నిదర్శనంగా ఉన్నారు. హీరో హీరోయిన్ల నుంచి మొదలు దర్శకుల వరకు పాత వాళ్లను వెనక్కి నెట్టి కొత్తవాళ్లు వస్తున్నారు.. ఒకప్పుడు పూరి జగన్నాథ్, ఆర్జీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపారు. ఇప్పుడు కాస్త వారి మానియా తగ్గింది.. ఇదే తరుణంలో కొత్త డైరెక్టర్లుగా వచ్చినటువంటి వ్యక్తుల్లో అనిల్ రావిపూడి ముందుస్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు..

Anil Ravipudi Viral Comments
కామెడీ చిత్రాలైన, లవ్ చిత్రాలైన ఏదైనా సరే కొత్తదనంతో తీయగల సత్తా కలిగిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో రాజమౌళి ఒక్క ఫ్లాప్ ని కూడా ఎదుర్కోలేదు.. ఇప్పుడు ఆ స్థానంలోకి అనిల్ రావిపూడి కూడా వచ్చి పడ్డారని చెప్పవచ్చు. పటాస్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ డైరెక్టర్ వరుసగా హిట్లు అందుకుంటూ తాజాగా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. (Anil Ravipudi)
Also Read: Allu Aravind: అల్లు మెగా బంధం తెగినట్టేనా.. ప్రేమతో కాదు భయంతో అల్లు అరవింద్ ఆ పని.?
ఈ సినిమా వల్ల దర్శక నిర్మాతలతో పాటు సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి లాభాలు అందాయి. దీంతో అనిల్ రావిపూడి పేరు కొండెక్కిందని చెప్పవచ్చు.. అయితే ఈయన నెక్స్ట్ ప్రాజెక్టు మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందట.. వీరిద్దరి కాంబోలో త్వరలోనే సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. కట్ చేస్తే విశ్వక్ సేన్ హీరోగా లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరవుగా మరో గెస్ట్ గా అనిల్ రావిపూడి కూడా వచ్చారు..

ఈ సందర్భంగా యాంకర్ సుమ వచ్చే జన్మలో స్త్రీగా పుట్టాలి అంటే ఏ హీరోయిన్ గా పుడతావని అడిగింది.. పాత హీరోయిన్లలో అయితే శ్రీదేవి లాగా, ప్రజెంట్ హీరోయిన్లలో అయితే తమన్న లాగా పుట్టాలని సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్న జనమంతా కేకలతో ఈలలతో గోల గోల చేశారు.. ఈ విధంగా అనిల్ రావిపూడి క్లియర్ సమాధానం ఇవ్వడంతో నేటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.(Anil Ravipudi)