Anirudh: అనిరుద్ కి మరో ఆల్టర్నేట్ దొరికేసినట్లేనా?

Anirudh: సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ (South Indian Music Industry)లో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) తన ‘కొలవెరి డి’ (Kolaveri Di) పాటతో ఒక రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘విక్రమ్’ (Vikram), ‘జైలర్’ (Jailer) వంటి పాన్ ఇండియా హిట్స్‌తో అనిరుధ్ పేరు అన్ని భాషల ప్రేక్షకులలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన సంగీతం ఉన్న సినిమా మ్యూజికల్‌గా సంచలనమే అని ముందే అంచనాలు పెరిగిపోతున్నాయి.
Anirudh dominance in danger
అయితే ఇప్పుడు అనిరుధ్‌కు మ్యూజిక్ డైరెక్షన్ (Music Direction) పరంగా గట్టి పోటీగా ఎదుగుతున్నాడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar). ‘అమరన్’ (Amaran) సినిమాతో వచ్చిన భారీ విజయంతో జీవీ మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఈ సినిమాలో ఆయన అందించిన క్లాసికల్ టచ్ సాంగ్స్ (Classical Touch Songs) మరియు బీజీఎమ్ (BGM) ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.
ఇప్పటికే విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమా ట్రైలర్‌కి జీవీ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మేకర్స్‌కి అనిరుధ్ తర్వాత జీవీ సెట్ అవుతాడన్న నమ్మకాన్ని కలిగిస్తోంది. గతంలో గ్యాంగ్‌స్టర్ బేస్డ్ కథలకు అనిరుధ్ పేరు ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు జీవీ కూడా అదే స్థాయిలో బీజీఎమ్ అందిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు.
ప్రస్తుతం జీవీ కోలీవుడ్‌లో (Kollywood) చాలానే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. నటుడిగా కూడా కొనసాగుతూ, సంగీత దర్శకుడిగా కూడా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. తెలుగులో కూడా ఆయనకు అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇది చూస్తే రాబోయే కాలంలో అనిరుధ్ – జీవీ మధ్య మ్యూజికల్ పోటీ మరింత ఆసక్కతిరంగా మారనుంది.