Anjali: స్టార్ నిర్మాతతో అంజలి ఎఫైర్.. బీఎండబ్ల్యూ కార్ తీసుకొని.?
Anjali: గ్లామర్ పాత్రలతో పాటు పద్ధతి గల పాత్రలు చేస్తూ ఓవైపు స్పెషల్ డాన్స్ లతో పాటు మరోవైపు నటనతో అలరిస్తున్న అంజలి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన అంజలి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.ఇక అంజలి ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీతో వచ్చినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. కానీ ఈ సినిమాలో నటించిన అంజలి పాత్రకి మాత్రం మంచి గుర్తింపు లభించింది..

Anjali affair with a star producer
ఇక అలాంటి అంజలి గత ఏడాది మదగదరాజ, గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి సినిమాలతో వచ్చింది.ఇక మదగదరాజ సినిమా తెలుగులో అంతగా సక్సెస్ కొట్టనప్పటికీ తమిళంలో మాత్రం భారీ హిట్ కొట్టింది.ఈ విషయం పక్కన పెడితే తాజాగా అంజలి ఓ రచయిత నిర్మాత అయినటువంటి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి.ఇక ఆ నిర్మాత రచయిత ఎవరంటే కోన వెంకట్.. కూతురు వయసు ఉన్న అంజలితో కోన వెంకట ఎఫైర్ ఏంటి అని అందరూ అనుకోవచ్చు. (Anjali)
Also Read: Athiya Shetty : అతియా శెట్టి బేబీ బంప్.. కేఎల్ రాహుల్ విజయంపై ఎమోషనల్ పోస్ట్!!
కానీ ఈ ఎఫైర్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే కోన వెంకట్ అంజలి మధ్య ఎఫైర్ వార్తలు రావడానికి కారణం వీరిద్దరి కాంబోలో ఎక్కువ సినిమాలు రావడమే. గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది,డిక్టేటర్ వంటి సినిమాలు వరుసగా రావడంతో వీరి మధ్య ఎఫైర్ వార్తలు అళ్లేశారు. అయితే ఈ విషయం గురించి రీసెంట్ గా కోన వెంకట్ మాట్లాడుతూ.. అంజలికి నాతో ఎలాంటి సంబంధం లేదు. ఆమెకు నేను ఒక ఫ్రెండ్ గా.. అన్నగా.. తండ్రిగా.. ఉన్నాను.. అంజలి చిన్నప్పటినుండి ఇబ్బందులు పడింది. ఆమెతో నేను సినిమాలు చేసేటప్పుడు చెన్నైలో ఉంది.ఆ టైంలో ఆమె తన పిన్ని దగ్గర కూడా ఇబ్బందులు పడింది.

ఆస్తి కోసం ఆమె పిన్ని తనని మోసం చేసింది. చిన్నప్పటి నుండి పిన్ని దగ్గరే పెరిగింది.కానీ ఆస్తి విషయంలో పిన్ని గొడవ చేయడంతో ఆమెకు నేను ఒక స్నేహితుడిగా అండగా నిలిచాను.ఆ తర్వాత తనకు వచ్చిన పారితోషికంతో అంజలి బీఎండబ్ల్యూ కారు కొనుక్కుంటే దాన్ని నా చేతుల మీదుగా తీసుకుంది. కానీ ఆమె కష్టార్జితం పోయి నేనే ఆ కారును గిఫ్టుగా ఇచ్చినట్టు రూమర్లు క్రియేట్ చేశారు.కానీ మా మధ్య ఎలాంటి సంబంధం లేదు అలాగే ఎవరు ఎన్ని వార్తలు రాసుకొని పుకార్లు సృష్టించినా నాకు సంబంధం లేదు అంటూ కోన వెంకట్ క్లారిటీ ఇచ్చారు.(Anjali)