Prabhas: ప్రభాస్ పెళ్లికి మళ్ళీ అడ్డంకి.. నిర్మాత కక్ష కట్టాడా ఏంటి.?
Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అంటే ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతూనే ఉంటుంది. ఆయన పెళ్లి ఈ ఏడాదైనా జరుగుతుంది కావచ్చు అని ఎంతో మంది అభిమానులు భావిస్తున్నారు. కానీ ఆయన సినిమాల లైనప్ చూస్తుంటే ఇప్పుడప్పుడే ప్రభాస్ పెళ్లి చేసుకునేలా లేడే అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని చాలామందిలో కాన్ఫిడెన్స్ ఉండేది.
Another obstacle to Prabhas marriage
కానీ ఆ నిర్మాత మాటలతో కాన్ఫిడెన్స్ అంతా పోయింది అంటున్నారు.మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరు.. ప్రభాస్ పెళ్లికి ఆయన అడ్డంకిగా ఎలా మారారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ పెళ్లికి అడ్డంకిగా మారారు అంటూ వార్తల్లో ఉన్న నిర్మాత ఎవరో కాదు అశ్వినీ దత్.అయితే ప్రభాస్ పెళ్లికి అశ్విని దత్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటయ్యా అంటే.. అశ్వినీ దత్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 మూవీ షూటింగ్ ని ఈ ఏడాది జూన్ లోనే స్టార్ట్ చేయబోతున్నాం అంటూ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.(Prabhas)
అయితే ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అయినప్పటికీ ప్రభాస్ పెళ్లి చేసుకుంటారు అని వెయిట్ చేసే అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే కల్కి-2 ని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కల్కి టు షూటింగ్లో పాల్గొన్నారు అంటే కచ్చితంగా ప్రభాస్ కి నాలుగైదు నెలల వరకు తీరిక ఉండదు. (Prabhas)
ఇక పెళ్లెప్పుడు చేసుకుంటారు అని చాలామంది ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఓవైపు ఫౌజీ, మరోవైపు ది రాజా సాబ్ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ రెండు షూటింగ్స్ ముగించుకొని పెళ్లి చేసుకునే పనిలో పడతారని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా జూన్ లో కల్కి -2 అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతున్నారు.అంతేకాదు ప్రభాస్ పెళ్లికి ఆ నిర్మాత అడ్డంకిగా మారిపోయారే అంటూ కొంతమంది ప్రభాస్ అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.(Prabhas)