Keerthy Suresh: పెళ్ళైన 2 నెలలకే కీర్తి సురేష్ వల్ల టార్చర్ అనుభవిస్తున్న ఆంటోనీ..?
Keerthy Suresh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. వీరందరిలోకెల్లా మంచి పేరు సంపాదించుకొని దూసుకుపోతున్నటువంటి హీరోయిన్ కీర్తి సురేష్. ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఫ్లాప్లే ఉన్నప్పటికీ ఆమెను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. అలాంటి కీర్తి సురేష్ లైఫ్ మహానటి సినిమా తర్వాత చాలా మారిపోయిందని చెప్పవచ్చు. మహానటికి ముందు ఒక లెక్క మహానటి తర్వాత మరో లెక్క అనే విధంగా, ఆ ఒక్క సినిమాతోనే ఆమె తన టాలెంట్ ఏంటో చూపించింది.
Antony is being tortured by Keerthy Suresh
అలాంటి కీర్తి సురేష్ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది.. బాలీవుడ్ లో బేబీ జాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది అని చెప్పవచ్చు. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కేవలం సినిమా విషయాలు కాకుండా తన పర్సనల్ లైఫ్ లో తన భర్త గురించి కూడా బయట పెట్టింది.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ” చాలామంది పెళ్లి తర్వాత అనేక మార్పులు వస్తాయని అన్నారు కానీ నా లైఫ్ లో అలాంటి మార్పులు ఏమీ రాలేదు.. (Keerthy Suresh)
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద జోకర్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్.?
నేను పెళ్లికి ముందు ఎలా ఉన్నానో పెళ్లి తర్వాత కూడా ఆ విధంగానే ఉన్నాను. నా భర్త ఆంటోనీ మాత్రం నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చింది. నేను ఎక్కడికి వెళ్లినా కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు.. ఫ్యాన్స్ ఎగబడి ఫోటోలు దిగడానికి వస్తూ ఉంటారు. ఇది నాకు అలవాటే అయినా కానీ నా పక్కన నా భర్త ఉన్నాడు కాబట్టి ఆయనకు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తోందట. కానీ నా కోసం ఆయన అన్ని భరిస్తూ సైలెంట్ గా ఉంటున్నారని చెప్పుకొచ్చింది..
నా భర్త పెద్దగా ఫోటోలు దిగడు కానీ నా కోసం అవన్నీ భరిస్తూ అర్థం చేసుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.. అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లి అనే పదానికి చాలా వ్యాల్యూ ఇస్తుంది. ఎందుకంటే ఆమె తన భర్త కట్టిన తాళిబొట్టును సినిమా ప్రమోషన్స్ లో కూడా అలాగే ఉంచుకొని, హిందూ సాంప్రదాయానికి గౌరవం ఇస్తుందని చెప్పవచ్చు.. ఈమెలాగే హీరోయిన్లంతా హిందూ సాంప్రదాయానికి గౌరవం ఇస్తూ తాళిబొట్టును మెడలో ఉంచుకోవాలని కొన్ని వర్గాల ప్రేక్షకులు అంటున్నారు.(Keerthy Suresh)