Anupama: అనుపమకి బ్రేకప్ అయ్యిందా.. ఆ మాటల వెనకున్న అర్థం ఏంటి.?
Anupama: సాధారణంగా చాలామంది హీరోయిన్లు ప్రేమలో విఫలమైన తర్వాత సోషల్ మీడియా వేదికగా వారి సంబంధించిన విషయాలను పంచుకుంటూ రకరకాల ఎమోజీలను పెడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తాజాగా అనుపమా పరమేశ్వరన్ ఒక మ్యాగజిన్ ఫోటోషూట్ లో మాట్లాడిన మాటలు వింటే మాత్రం ఆమె ప్రేమలో విఫలమైందని అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె ఏం మాట్లాడింది ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Anupama broke up What is the meaning behind those words
అనుపమ పరమేశ్వరన్ తెలుగు ఇండస్ట్రీలో ఈమె తెలియని వారు ఉండరు. నిండైన తెలుగు అమ్మాయిల పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి అనుపమ ఈ మధ్యకాలంలో ప్లేట్ ఫిరాయించి బోల్డ్ పాత్రల్లో కూడా నటిస్తోంది. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమాలో ఈమె చేసిన రొమాన్స్ కు అందరూ పరేషాన్ అయిపోయారు. (Anupama)
Also Read: Daku Maharaj: వైలెన్స్ ఉందని డాకు మహారాజ్ మూవీని మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో.?
అలాంటి అనుపమ తాజాగా ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ కి వెళ్లి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఈ ఈవెంట్ లో ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావన రావడంతో ” నేను ఎప్పటికీ ప్రేమిస్తాను అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధం.. నా జీవితంలో అలాంటిది ఎప్పుడు జరగదు.. టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నవారు ఏమీ ఆలోచించకండి వెంటనే పారిపోండి” అంటూ తెలియజేసింది.
ఇది విన్నటువంటి ఆమె అభిమానులంతా అనుపమ హార్ట్ ను ఎవరో బ్రేక్ చేశారని అందుకే ఈ విధంగా మాట్లాడుతోందని ప్రేమపై పూర్తిగా నమ్మకం కోల్పోయిందని అంటున్నారు. అంతేకాదు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎప్పుడు ఓపెన్ గా చెప్పని ఈ ముద్దుగుమ్మ లవ్ గురించి ఓపెన్ గా చెప్పడంతో నేటిజన్స్ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.(Anupama)