Anupama Parameswaran: సైలెంట్ గా పెళ్లికి రెడీ అయిన అనుపమ.. ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంటి..?
Anupama Parameswaran: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అంటే తెలియని వారు ఉండరు.ఈ ముద్దుగుమ్మ తన సినిమాలతో ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే అలాంటి హీరోయిన్ తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్టు మలయాళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. చూస్తే పక్కింటి అమ్మాయిలా ఉండే అనుపమ పరమేశ్వరన్ తన యాక్టింగ్ తో ఎంతోమందిని ఫిదా చేసింది.
Anupama Parameswaran who is silently ready for marriage
అలా అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో శతమానం భవతి,అఆ, కృష్ణార్జున యుద్ధం,ఉన్నది ఒకటే జిందగీ,రాక్షసుడు వంటి ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే కార్తికేయ టు వంటి పాన్ ఇండియా మూవీలో కూడా నటించింది.అయితే ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది టిల్లు స్క్వేర్ మూవీతో అందరిని షాకింగ్ కి గురి చేసింది. ఎందుకంటే ఈ సినిమాలో అనుపమ చాలా బోల్డ్ గా చేసి అందర్నీ నోరేళ్లబెట్టేలా చేసింది.(Anupama Parameswaran)
Also Read: Salman Khan: ప్రభాస్ మదర్ ని టార్చర్ చేసిన సల్మాన్ ఖాన్.?
ఈ విషయం పక్కన పెడితే..తాజాగా ఈ ముద్దుగుమ్మ సైలెంట్ గా పెళ్లికి రెడీ అయిపోయింది అంటూ మలయాళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా కీర్తి సురేష్ పెళ్ళంటూ సడెన్ ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక కీర్తి సురేష్ బాటలోనే అనుపమ పరమేశ్వరన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక గత కొద్దిరోజుల నుండి అనుపమ పరమేశ్వరన్ ఓ హీరోతో ప్రేమలో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తెలుగు హీరోని పెళ్లి చేసుకోబోతుంది అని కొంతమంది అంటే లేదు లేదు.. మలయాళీ హీరోతో అనుపమ పరమేశ్వరన్ ఏడడుగులు వేయబోతుందని అంటే ఇంకొంత మంది ఏమో బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అని ఇలా ఎవరికి తోచిన కామెంట్లు వాళ్ళు పెడుతున్నారు. మరి అనుపమ పరమేశ్వరన్ ని చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరో తెలియాల్సి ఉంది.(Anupama Parameswaran)