Anupriya Goenka: మనోజ్ హీరోయిన్ ప్రైవేట్ ప్లేస్ ని గట్టిగా నొక్కిన హీరో.?

Anupriya Goenka: అనుప్రియ గోయెంక అంటే సౌత్ సినీ ప్రేక్షకులకు ఎవరికి తెలియకపోవచ్చు.కానీ మంచు మనోజ్ హీరోగా నటించిన పోటుగాడు సినిమాలో చేసిన హీరోయిన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. అయితే ఈ సినిమా చూసిన వారికి మాత్రం అనుప్రియ గోయెంక తెలిసే ఉంటుంది. అయితే అలాంటి అనుప్రియ తెలుగులో కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేసింది.అలా పద్మావత్, టైగర్ -3 వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
Anupriya Goenka shocking comments
అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా ఈ హీరోయిన్ రాణించింది.అయితే అలాంటి అనుప్రియ గోయెంక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. మరి ఆమె ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. సీన్ డిమాండ్ చేస్తే ఇంటిమేట్ సన్నివేశాలలో ఒదిగిపోయి నటించే అనుప్రియ గోయెంక ఓ ఇంటిమేట్ సీన్ చేసే సమయంలో మాత్రం చాలా ఇబ్బంది పడిందట.(Anupriya Goenka)
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఉరేసుకొని చనిపోవాలనుకున్న హీరో.. ఎవరంటే.?
ఓ సినిమా షూటింగ్ సమయంలో లిప్ కిస్ సీన్ చేసేటప్పుడు ఓ నటుడు అనుప్రియని అసభ్యంగా టచ్ చేసారట. డైరెక్టర్ నడుము దగ్గర సరదాగా అలా చేయి వేసి పట్టుకోమని చెబితే ఆ నటుడు మాత్రం అనుప్రియ ప్రైవేట్ పార్ట్ ని పట్టుక్కున్నాడట. అయితే ఆ టైంలో అనుప్రియ డ్రెస్ కూడా సౌకర్యంగా లేకపోవడంతో కాస్త అసహనంగా ఫీల్ అయిందట.అయితే ఇదే విషయాన్ని ఆమె ఆ నటుడికి చెప్పినా కూడా ఆయన అంతగా రియాక్ట్ అవ్వరు.

ఎందుకంటే పొరపాటున అలా పట్టుకున్నాను సారీ అని చెబుతారు అని గ్రహించిన అనుప్రియ మరో సీన్ లో ఇలా ప్రవర్తించకండి కాస్త చూసుకొని చేయండి అని మాత్రమే చెప్పిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా అనుప్రియ బయటపెట్టింది. ఇక అనుప్రియ తో అలా అసభ్యంగా ప్రవర్తించిన ఆ హీరో ఎవరు ఆ వివరాలు ఏంటో మాత్రం బయట పెట్టలేదు. కానీ అనుప్రియ మాటలు గ్రహించిన చాలా మంది నెటజన్లు టెలివిజన్ సిరీస్ అయినటువంటి సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో నటించిన హీరోనే అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.(Anupriya Goenka)