Anushka: తమిళ డైరెక్టర్ తో అనుష్క ఎఫైర్.. అంత దరిద్రపు పనిచేస్తుందా.?
Anushka: తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.. కానీ వారందరిలో ప్రత్యేకతను చాటుకున్నటువంటి హీరోయిన్ అనుష్క శెట్టి.. లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా తనకు ఎదురు లేదు అనిపించుకుంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలం దాటిపోయింది. అయినా ఆమెకు ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి..

Anushka realation with Tamil director
అలాంటి అనుష్క శెట్టి టాలీవుడ్ లోకి నాగార్జున హీరోగా చేసిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఆమెకు మహానంది, విక్రమార్కుడు, అస్త్రం, రెండు, స్టాలిన్, లక్ష్యం, వంటి చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇందులో ఎక్కువ చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ఆమె పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అలాంటి అనుష్క శెట్టి ‘అరుంధతి’ సినిమాలో లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు.. (Anushka
ఈ సినిమా తర్వాత ఆమె ప్రభాస్ హీరోగా వచ్చిన “బాహుబలి” చిత్రంలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.. ఈ విధంగా సినిమాల్లో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఈ ముదురు భామ ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు.. అయితే ఈ అందాల భామ ప్రభాస్ ను చేసుకుంటుందని ఇప్పటికే అనేక వార్తలు వస్తూ ఉంటాయి. ఈ విషయంపై వీళ్లు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ మాది ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పుకొస్తున్నారు..

ఇదంతా కొనసాగుతున్న తరుణంలో ఈమె ఒక తమిళ దర్శకుడితో లవ్ లో ఉందని త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఏంటో తెలియదు కానీ ఈ వార్త నెట్టింటా చక్కర్లు కొట్టడంతో కొంతమందిని నెటీజెన్స్ మా ప్రభాస్ అన్నకు గుడ్ బాయ్ చెప్పేస్తున్నావా, ఇప్పటికైనా పెళ్లి చేసుకో చాలా లేట్ అయింది, అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Anushka)