Virat Kohli: ప్రతి రోజు అదే పని… కోహ్లీ ఫిట్నెస్ పై అనుష్క కామెంట్స్ ?
Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అందుకు కోహ్లీ ఫిట్నెస్ కూడా ఓ కారణమని చెప్పవచ్చు. ఫిట్నెస్ విషయంలో కోహ్లీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాజా గా ఇదే విషయంపైన విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్పందించారు. కోహ్లీ పాటించే ఫిట్నెస్, డైట్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఫిట్నెస్ కి విరాట్ కోహ్లీ చాలా ప్రాముఖ్యతను ఇస్తారని అనుష్క వెల్లడించారు. Virat Kohli

anushka sharma about Virat Kohli fit ness
డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడని కేవలం మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాడని అనుష్క అన్నారు. ఫిట్నెస్ కోసం ఫుడ్ తో పాటు వ్యాయామాలు కూడా చాలా ముఖ్యమని విరాట్ కోహ్లీ అంటాడని అనుష్క చెప్పారు. చాలామంది సెలబ్రిటీలు ఇలానే డైట్ ఫాలో అవుతారని అనుష్క అన్నారు. కోహ్లీ కూడా ఇదే ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాడని అనుష్క శర్మ వెల్లడించారు. ఉదయం లేచిన వెంటనే ఎక్సర్సైజ్ లు చేస్తాడని కోహ్లీ సీక్రెట్స్ ను అనుష్క చెప్పారు. Virat Kohli
Also Read: Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం..బతుకమ్మ ఎక్కడా ?
ఎక్సర్సైజ్ అనంతరం తనతో కాసేపు సమయాన్ని గడుపుతాడని అనుష్క చెప్పారు. ఆ వెంటనే క్రికెట్ ప్రాక్టీస్ కు వెళతాడని అనుష్క కొనియాడారు. కోహ్లీ భోజనం విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటాడని, జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లడని అనుష్క చెప్పింది. కూల్ డ్రింక్స్ తాగడానికి కూడా అసలు ఇష్టపడడని అనుష్క అన్నారు. కొన్ని వంటకాలు దాదాపు పది సంవత్సరాల నుంచి కోహ్లీ అస్సలు తినలేదని అందులో బటర్ చికెన్ కూడా ఒకటని అనుష్క అన్నారు. కోహ్లీ బటర్ చికెన్ తిని దాదాపు పది సంవత్సరాలకు పైనే అవుతుందని అనుష్క చెప్పారు. ప్రస్తుతం అనుష్క షేర్ చేసుకున్న ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. Virat Kohli