Pawan Kalyan: ఏపీలో… రియల్ సినిమా చూపిస్తున్న పవన్ కళ్యాణ్?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియల్ హీరోగా మారిపోయారు. ప్రజల వద్దకు పాలన అన్నట్లుగా…. కాలినడకన వెళ్లి… ట్రైబల్స్ సమస్యలు తీర్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ మేరకు భారీ భద్రత నడుమ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు పవన్ కళ్యాణ్. Pawan Kalyan
ap deputy cm pawan kalyan visited parvatipuram manyam district
ఈ సందర్భంగా తెల్లటి దుస్తులు అలాగే శాలువా కప్పుకొని… అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా అక్కడ అందాలు కూడా… తిలకించారు. కాలినడకన గుట్టపైకి ఎక్కారు. ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలోని బాగు జోల గ్రామంలో పర్యటించడం జరిగింది. అక్కడ ట్రైబల్స్ సమస్యలు తెలుసుకొని… రోడ్లు వేయిస్తామని ప్రకటన చేశారు. Pawan Kalyan
Also Read: Formula E race controversy: కీలక ఆధారాలు బయటపెట్టిన కేటీఆర్… రేవంత్ రెడ్డి కూడా?
బాగుజోల వద్ద గిరిజనులతో కలసి సంప్రదాయ నృత్యం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…. వాళ్లతో ఎంజాయ్ చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ప్రజలతో కలిసి ఆడిన పవన్ కళ్యాణ్… చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేశారు. దీంతో సోషల్ మీడియాలో మొత్తం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. Pawan Kalyan