AR Rahman: ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ మొదటి స్థానంలో ఉంటారు..ఈయన సినిమాకి సంగీతం ఇచ్చారు అంటే అది ఎవరు గ్రీన్ గా నిలుస్తుంది. సంగీత దర్శకుడిగా తీసుకోవడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు చేస్తూ ఉంటారు. సంగీతానికే సంగీతం నేర్పే విధంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఏ ఆర్ రెహమాన్ ఎంతో దూసుకుపోతున్న తన సొంత లైఫ్ లో మాత్రం బోల్తా పడ్డారని చెప్పవచ్చు.. ఈయన కూడా సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది నటీనటుల లాగే తన భార్యకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా .
AR Rahman who is going to get a divorce
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గ్రహిత రెహమాన్ 1995లో సైరా భాను అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ వీరి పెళ్లి జరిగి 29 సంవత్సరాలు పూర్తయి 30వ సంవత్సరం వస్తుంది. వీరికి రహీం, ఖాతీజా, ఆమీన్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా కొనసాగుతున్నటువంటి వీరి జీవితంలో ఏ విపత్తు వచ్చిందో ఏమో కానీ వీరు విడాకులు తీసుకోని విడిపోతున్నారని లాయర్ వందనాష అధికారికంగా తెలియజేశారు. (AR Rahman)
Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లాడబోయేది ఇతన్నే.. డిసెంబర్లో పెళ్లి ఫిక్స్.. అఫీషియల్ న్యూస్..?
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రెహమాన్ అభిమానులంతా షాక్ అయిపోతున్నారు. దీంతో ఏఆర్ రెహమాన్ స్పందించి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశాడు. మా వివాహ బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుకుందని సంతోషించాను.. అనుకోని విధంగా ఈ బంధానికి ముగింపు పలకాల్సి వచ్చింది.. మా పగిలిన హృదయాలు దేవున్ని సైతం ప్రభావితం చేస్తాయి, కానీ పగిలిన ముక్కలు మళ్ళీ యధావిధిగా అతుక్కోవ్.
అయినా మేము మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ కఠిన పరిస్థితుల్లో అభిమానులు స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు విపరీతంగా వైరల్ అవ్వడంతో వీరు ఎందుకు విడాకులు తీసుకోబోతున్నారో తెలియక అభిమానులంతా సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న ఆర్సి16 సినిమాకు సంగీతం అందిస్తున్నారు.(AR Rahman)