Buttermilk: ఎండాకాలంలో మజ్జిగ తాగుతున్నారా..అయితే ఇవి తెలుసుకోండి ?


Buttermilk: వేసవికాలం వచ్చిందంటే సూర్యుడు నెత్తి మీద ఉంటాడు. బయటికి వెళ్తే చాలు డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. దానివల్ల ప్రతి ఒక్కరూ వేసవిలో వివిధ రకాల పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. అందులో ముఖ్యంగా ఫ్రూట్ జ్యూస్ లు, నిమ్మరసం, మజ్జిగ లాంటివి తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. 100 మిల్లి లీటర్ల మజ్జిగ తాగినట్లయితే దాదాపు 40 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. ఇది పాల కన్నా చాలా తక్కువ కేలరీలను, కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది.

Are you drinking buttermilk in the summer

మజ్జిగ తాగినట్లయితే శరీరానికి ప్రోటీన్లు, కాల్షియం, సోడియం, విటమిన్లు, పొటాషియం అధికంగా అందుతాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి మజ్జిగ ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఒక కప్పు మజ్జిగలో దాదాపు చాలా కేలరీలు ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. బరువు తగ్గాలని అనుకునే వారు ప్రతి రోజు ఒక గ్లాసుడు మజ్జిగ తప్పకుండా తాగాలి. మజ్జిగలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సాహిస్తాయి. మజ్జిగలో ఉండే కాల్షియం ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగలో ఐరన్ అధికంగా ఉంటుంది. దానివల్ల కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి.

Cm Revanth Reddy: గుమ్మడి నర్సయ్య దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి ?

ఇక ఒక గ్లాసుడు మజ్జిగలో పావు టీ స్పూన్ మెంతి గింజల పొడిని కలిపి తాగినట్లయితే మరింత మంచిది. ఇది బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తొలగించడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి మజ్జిగ ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పవచ్చు. మజ్జిగ బరువు తగ్గడానికి, శరీరంలోని కొవ్వును తొలగించడానికి సహాయం చేస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసుడు సరైన పరిమాణంలో, సరైన సమయంలో మంచిగ తాగడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. అంతేకాకుండా ఒక గ్లాసుడు మజ్జిగ తాగినట్లయితే కడుపు నిండుగా ఉంటుంది. కేలరీలను పెంచుతుంది. మజ్జిగ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. వేసవి కాలం కావడం వల్ల చిన్న పిల్లలకు కూడా కొద్దిగా మజ్జిగను తాగించడం వల్ల వారి కడుపులో చల్లగా ఉండి ఆరోగ్యంగా, ఎనర్జీగా ఆడుకుంటారు.

Congress: నెల రోజుల పాటు.. ‌ఊరూరా కాంగ్రెస్ పండుగ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *