Lemon Water: వేసవికాలంలో నిమ్మరసం తాగుతున్నారా..అయితే జాగ్రత్త ?


Lemon Water: వేసవికాలం వచ్చేసింది అంటే ఎండలు విపరీతంగా కొడతాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో అలసట, నీరసం ఉంటుంది. అంతేకాకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల విపరీతంగా దాహం వేస్తుంది. బయటికి వెళ్లిన సమయంలో చాలామంది జ్యూస్ లు, రసాలు తాగుతూ ఉంటారు. అందులో నిమ్మరసం ఒకటి. వేసవికాలంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు అందడమే కాకుండా అలసట, నీరసం లేకుండా ఉంటాము.

Are you drinking Lemon Water in the summer

అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. ఇక నిమ్మరసం ఆరోగ్యానికి వేసవికాలంలో మరింత మంచిదని చెప్పవచ్చు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. నిమ్మరసం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది ప్రతిరోజూ తాగుతూ ఉంటారు. నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివలన అంటువ్యాధుల బారిన పడకుండా ఉంటారు. నిమ్మరసం శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి సహాయం చేస్తుంది.

నిమ్మరసం శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసం తాగినట్లయితే శరీరాన్ని డిహైడ్రేటెడ్ కాకుండా ఉంచుతుంది. ఆరోగ్యానికి మంచిదే కదా అని నిమ్మరసాన్ని అధికంగా తీసుకోకూడదు. మోతాదుకు మించి నిమ్మరసం తాగినట్లయితే వాంతులు, అలర్జీ, గ్యాస్, అల్సర్ సమస్యలు వస్తాయి. పల్లు సెన్సిటివ్ గా తయారవుతాయి. అందువల్ల పరిమిత పరిమాణంలో మాత్రమే నిమ్మరసం తాగాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

వారంలో రెండు, మూడు సార్లు మాత్రమే నిమ్మరసం తాగాలని చెబుతున్నారు. నిమ్మరసం కాకుండా వాటర్ మిలన్ జ్యూస్, పపాయ, ఆపిల్, ద్రాక్ష ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న జ్యూస్ లు తాగాలని చెబుతున్నారు. అంతేకాకుండా కీరదోస, బీట్రూట్, క్యారెట్ ఇలాంటి ఆహారాలు ఎక్కువగా తినాలని చెబుతున్నారు. దీనివల్ల వేసవిలో శరీరాన్ని కాపాడుకోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *