Saif Alikhan: సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం.. 2012లో రెస్టారెంట్ లో ఏం జరిగింది.?
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన సినిమాల ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నారు. అంతటి దిగ్గజ హీరోను తాజాగా ఒక వ్యక్తి మర్డర్ చేసే ప్రయత్నం చేశాడు. చివరికి కత్తితో పలు విధాలుగా పొడిచి ఆ దుండగుడు పారిపోయాడు. మరి సైఫ్ ఆలీపై దాడి చేసింది ఎవరు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.. సైఫ్ అలీ ఖాన్ 2012లో ఒక ఫేమస్ వ్యాపారవేత్తతో ఘర్షణ పడ్డారు.. అయితే సైఫ్ ముంబైలోని వాసభి రెస్టారెంట్ లో తన భార్య అప్పటి ప్రేయసి కరీనాకపూర్ మరియు ఇతర ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ కి వెళ్ళాడట.
Assassination attempt on Saif Ali Khan
ఆ రెస్టారెంట్ లో వీరంతా ఒక్క దగ్గర కూర్చుని తినుకుంటూ గట్టిగా కేకలు వేస్తూ నవ్వుకున్నారట. ఈ టైం లోనే ఆ రెస్టారెంట్ లో సౌతాఫ్రికాకు చెందిన ఒక బడా వ్యాపారవేత్త ఇక్బాల్ శర్మ కూడా ఉన్నారట. అలా సైఫ్ అలా కేకలు వేయడంతో కాస్త సైలెంట్ గా చేసుకోండి అంటూ ఆయన అన్నారట. సైఫ్ అలీ ఖాన్ వినకుండా గట్టిగా అరుస్తుండడంతో సార్ ప్లీజ్ కొంచెం డిస్టర్బ్ చేయకండి అంటూ ఆ వ్యక్తి లేచాడట. వెంటనే సైప్ అలీఖాన్ నన్నే ఆగమంటావా అంటూ ఇద్దరి మధ్య గొడవ జరిగి పోలీసుల వరకు వెళ్లిందట. చివరికి సైఫ్ అలీఖానే ముందుగా లేచి ఆ వ్యక్తిని కొట్టడంతో, సైఫ్ దే తప్పయింది. (Saif Ali Khan)
Also Read: Sanjana Galrani:ఆ హీరో అక్కడ పట్టుకొని పిసికేసాడు.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.?
ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. ఇక దీనిపై కేసు అవ్వడంతో చివరికి సైఫ్ అలీఖాన్ ఇక్బాల్ ఇద్దరూ కలిసి కాంప్రమైజ్ అయి కేసును క్లోజ్ చేసుకున్నారట. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడంతో గతంలో ఆయన గొడవలు పెట్టుకున్న వారి లిస్టులను పోలీసులు వెతుకుతున్నారు. దీనిలో భాగంగానే ఇక్బాల్ శర్మ కూడా ఏమైనా భాగమయ్యాడా అంటూ విచారణ చేశారట కానీ ఆయనకి ఏమి సంబంధం లేదని తెలిసింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఒక దొంగ అని, ఇంటి వెనుక భాగం నుంచి వచ్చి ఇంట్లోకి దూరాడని, రాత్రి సమయంలో సైప్ చిన్న కొడుకు జహంగీర్ బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఆయా కేకలు వేయడంతో, వెంటనే సైఫ్ కిందకి వచ్చి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారట.
దీంతో ఇద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో ఆ వ్యక్తి తప్పించుకోవడం కోసం సైఫ్ ను కత్తితో పలుచోట్ల పొడిచాడని, ఆయన కుప్పకూలి పోగానే ఆ వ్యక్తి పారిపోయాడని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుని కోసం పలు పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. అంతేకాదు ఈ వ్యక్తి లోపటికి ఎలా రాగలిగాడు ఇంట్లో పనిచేసే వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా వీరు ఆరాతీస్తున్నారట. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు సర్జరీ జరిగిందని పెద్దగా ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.(Saif Ali Khan)