Assistant director: ఛాన్స్ ఇస్తానని హోటల్ రూమ్ లో మహిళపై అసిస్టెంట్ డైరెక్టర్ లైంగిక దాడి..?
Assistant director: సినిమా ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చే చాలామందిపై అత్యాచారాలు లైంగిక దాడులు జరగడం ఇదేమి కొత్తేమీ కాదు.. అయితే తాజాగా ఓ మహిళపై టాలీవుడ్ లో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ లైంగిక దాడి చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.అయితే ఆ మహిళ ఎవరికి భయపడకుండా వీడియోని లీక్ చేస్తానని భయపెట్టినా కూడా అస్సలు తగ్గకుండా వెంటనే వెళ్లి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట.మరి ఇంతకీ మహిళను అవకాశం ఇస్తానని చెప్పి లైంగికంగా దాడి చేసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే కాటేకొండ రాజు..
Assistant director sexually assaulted a woman in a hotel room
టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 32 ఏళ్ల మహిళకి అవకాశం ఇస్తానని చెప్పి లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకున్నారట.అయితే 32 ఏళ్ళున్న ఆ మహిళ భర్తతో విడాకులు తీసుకోవడంతో హైదరాబాద్ కి వచ్చేసింది. ఆ తర్వాత మణికొండలో హౌస్ కీపింగ్ పనిచేస్తూ సినిమాల మీద ఉన్న మక్కువతో సినిమాల్లో చేయాలని అనుకుందట. అయితే ఈమెకి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తెలుసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ కాటేకొండ రాజు ఆమెను కృష్ణానగర్ లోని హెవెన్ హోటల్ కి పిలిపించి ఆడిషన్స్ ఉన్నాయని ఫోటోషూట్ కోసం రమ్మన్నారట. (Assistant director)
Also Read: Tabu: పెళ్లి వద్దు.. బెడ్ మీద మగాడు ఉంటే చాలు.. టబు బోల్డ్ కామెంట్స్..?
అయితే ఈ విషయం నిజమేనని నమ్మిన మహిళ అక్కడికి వచ్చి ఫోటో షూట్ ఇచ్చిందట.ఆ తర్వాత రెండో రోజు కూడా అదే రూమ్ కి మళ్లీ రమ్మన్నారట. అయితే మళ్లీ ఫోటోల కోసమే కావచ్చని ఆ మహిళ అసిస్టెంట్ డైరెక్టర్ ని నమ్మి వెళితే అసిస్టెంట్ డైరెక్టర్ ఇదే అదనుగా చూసుకొని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడట. దాంతో ఆ బాధిత మహిళ వెంటనే శుక్రవారం రోజు జూబ్లీహిల్స్ లోని పోలీసులకు కాటేకొండ రాజు మీద ఫిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు కాటేకొండ రాజు పై బిఎన్ఎస్ 64, 79 వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.
అయితే ఈ విషయం బయట చెబితే నీకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటపెడతానని కాటేకొండ రాజు ఆ మహిళను బెదిరించినప్పటికీ ఆ మహిళ భయపడకుండా వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట.ఈ విషయం ఇప్పుడు మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఆ మహిళకు న్యాయం చేయాలని ఆ కీచక అసిస్టెంట్ డైరెక్టర్ కి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.(Assistant director)