Ather Rizta: ఇండియన్ మార్కెట్ లోకి… అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. ఇందులో పెట్రోల్ అలాగే డీజిల్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రెండు వాహనాలకు పోటీగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో… ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువగా డిమాండ్ పెరిగింది. Ather Rizta
Ather Rizta bikes in the market160 km mileage
ఇక దీనికి తగ్గట్టుగానే కస్టమర్లు కూడా ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కంపెనీ అయిన Athar ఎనర్జీ అదిరిపోయే ప్రకటన చేసింది. ఏతర్ ఎనర్జీ తన Rizta… ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను షురూ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ కంపెనీ బైక్ ధర అలాగే ఫీచర్స్ కూడా వివరించింది. Ather Rizta
Also Read: Land Rover Defender Octa: మార్కెట్ లోకి అదిరిపోయే కారు…ధర, ఫీచర్స్ !
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 1.10 లక్షల నుంచి 1.45 లక్షల వరకు ఉంటుంది. మొట్టమొదటగా ఢిల్లీ, లక్నో ఆగ్రా జైపూర్ నాగపూర్ ఆంధ్ర ప్రదేశ్ లాంటి నగరాలలో ఈ కంపెనీ వాహనాలను డెలివరీ చేయనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ బైక్స్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ బైకు… 3.7 సెకండ్లలో 40 స్పీడ్ వేగంతో దూసుకు వెళ్తుంది. అంతేకాదు ఒక్కసారి మనం ఫుల్ చార్జింగ్ పెడితే ఈ బైక్ 159 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. Ather Rizta
అంతేకాకుండా ఇందులో… 2.9kwh బ్యాటరీలు కూడా ఉన్నాయి. ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ ఎక్కాలంటే 5 గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది. మరికొన్ని మోడల్ బైక్స్ అయితే నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు సమయం తీసుకుంటుంది. అది బ్యాటరీ కెపాసిటీని బట్టి ఉంటుంది. Ather Rizta