Atlee Confirms: బన్నీ తో మాట్లాడిన అట్లీ.. దేనికోసమంటే?
Atlee Confirms: పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’కు పోటీగా, వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘బేబీ జాన్’ ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. తేరీ సినిమా రీమేక్ గా రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే పుష్ప విడుదలైన కొన్ని రోజులకే ఈ సినిమా రావడం, పుష్ప కి అందరూ వెళ్తుండడం ఈ సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుందని అందరూ అనుకుంటున్నారు.
Atlee Confirms No Pushpa 2 Competition
ఈ నేపథ్యంలో ‘బేబీ జాన్’ దర్శకుడు అట్లీ స్పందిస్తూ, “పుష్ప 2 డిసెంబర్ మొదటి వారంలో విడుదల అయ్యింది. మా సినిమా నాల్గవ వారంలో విడుదల అవుతుందని, అందువల్ల పోటీ అంతగా ఉండదని” తెలిపారు. అదేవిధంగా, అల్లు అర్జున్‌తో ఫోన్లో మాట్లాడి ఆయన పుష్ప ద్వారా విజయం కోరారని, రెండు సినిమాల విజయానికి ఆకాంక్షిస్తున్నామని అట్లీ వెల్లడించారు. ఇది ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచింది.
Also Read: Game Changer: అమెరికాలో భారీగా ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్.. పుష్ప స్ట్రాటజీ!!
‘బేబీ జాన్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు వరుణ్ ధావన్ ల నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ప్రత్యేకించి కీర్తి సురేష్ చేసిన ప్రమోషన్స్ సినిమాపై హైప్‌ను పెంచాయి. అయితే ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుండగా ‘బేబీ జాన్’ వసూళ్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హిట్ టాక్ వస్తే ‘బేబీ జాన్’ కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే అవకాశం ఉంది. అట్లీ వంటి స్టార్ దర్శకుడు, మరియు వరుణ్ ధావన్ తెలుగులో ప్రేక్షకులను మెప్పించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. మొత్తంగా బేబీ జాన్ సినిమా పెద్ద విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాయి చూడాలి.