BRS – KTR: యాదాద్రి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి…రంగంలోకి కేటీఆర్ !

BRS – KTR: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని అంటున్నారు. అయినప్పటికీ…పోలీసులు చోద్యం చూశారట. మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడులు జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ NSUI నాయకులు…. ఆఫీస్ ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు.

Attacks on BRS party office in Bhuvanagiri district KTR

ఇక యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్…. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందని ఆగ్రహించారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహించారు.

ఎన్నుకున్న ప్రజలతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని తెలిపారు కేటీఆర్‌. దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని… వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *