Prashanth Neel: కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ అందించిన “బఘీర” చిత్రం విడుదలకు ముందు విపరీతమైన అంచనాలను ఏర్పరుచుకుంది. హోంబాలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాతో శ్రీమురళి స్టార్‌గా నిలబడతాడని అందరూ భావించారు. అయితే, సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులలో నిరాశే చోటు చేసుకుంది. ప్రశాంత్ నీల్ మ్యాజిక్ ఈ సినిమాకి దోహదపడలేదనే చెప్పాలి.
Audience Reactions to Prashanth Neel Bagheera
“బఘీర” కథనంగా చూస్తే, ఇది చాలామందికి చాలా సాదారణంగా అనిపించింది. ACP వేదాంత్ పాత్రలో శ్రీమురళి కనిపిస్తాడు. చిన్ననాటి నుంచి పోలీస్ అధికారిగా ఎదగాలనే కలలు కనే వేదాంత్, నిజ జీవితంలో పోలీస్ అధికారి అయినప్పటి నుండి ఎదుర్కొనే సమస్యలు, అతని బఘీర అవతారం, ప్రధాన ప్రతినాయకుడు రాణా (గరుడ రామ్)తో పోరాటం వంటి అంశాలు కథలో ప్రధానంగాకనిపిస్తాయి. కథనం కొత్తగా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు ఇది రొటీన్ యాక్షన్ డ్రామాగా మారడంతో కొంత అసంతృప్తి కలిగించింది.
Also Read: Trailer of Matka: ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “మట్కా” టీజర్!!
దర్శకుడు డాక్టర్ సూరి, కథను మరో స్థాయికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. రుక్మిణి వసంతతో వేదాంత్ మధ్య ప్రేమకథ ఆకట్టుకోలేదు. ఇక యాక్షన్ సన్నివేశాలు బాగా తీసినా, వాటిలో భావోద్వేగం లేకపోవడం వల్ల ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయాయి. వేదాంత్ మరియు రాణా మధ్య ఉండాల్సిన హై వోల్టేజ్ కెమిస్ట్రీ మిస్సయ్యింది. కెజిఎఫ్, సలార్ లాంటి సినిమాల్లో కనిపించే మాస్ యాక్షన్ సీన్స్‌కు సరితూగే రీతిలో ఈ సినిమాలో కొత్తదనం కనిపించకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది.
మొత్తానికి, “బఘీర” చిత్రం సాధారణమైన యాక్షన్ సినిమాగా నిలిచిపోయింది. ప్రశాంత్ నీల్ కథను రాసినప్పటికీ, ఆయన చేసిన పాత సినిమాల స్థాయిని చేరుకోలేకపోయింది. ఈ కారణంగా, సినిమా చూసిన ప్రేక్షకులు కొంత నిరుత్సాహంతో తిరిగి వెళ్లే పరిస్థితి తలెత్తింది. “బఘీర”కు అనుకున్న అంచనాలు మాత్రం అందుకోలేదన్నది కన్నడనుంచి విన్పిస్తున్న మాట. ఈ ఎఫెక్ట్ ఎన్టీఆర్ సినిమా పై ఉంటుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు అపజయం లేని దర్శకుడుగా ఉన్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు సినిమాలు ఎలా చేస్తాడో చూడాలి.