Avoid These Foods: ఎట్టి పరిస్థితుల్లో ఈ పదార్థాల్ని ఫ్రిజ్ లో పెట్టకూడదు.. ఇవి ఆరోగ్యానికి హానికరం..!!
Avoid These Foods: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ అవసరమయ్యే సాధనంగా మారింది. మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచి భద్రపరచడం సాధారణ పద్ధతిగా మారిపోయింది. పచ్చళ్ళు, కూరలు, బిర్యానీ వంటి వస్తువులు నిల్వ చేసేందుకు ఫ్రిజ్ వాడుతున్నారు. అయితే, ఫ్రిజ్‌లో ఏది ఉంచాలో, ఏది ఉంచకూడదో తెలుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఫ్రిజ్‌లో ఉంచకూడని కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
Avoid These Foods in Your Fridge
అరటి పండ్లను కొంతమంది ఫ్రిజ్‌లో పెట్టడం అలవాటు చేసుకున్నారు. కానీ, ఇది చాలా తప్పుడు ఆచారం. అరటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషకాలు తగ్గిపోతాయి. ఫ్రిజ్ మొత్తం అరటి వాసనతో నిండిపోవడం కూడా సాధారణం. అలాగే, వైట్ బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పిండి పదార్థం విచ్ఛిన్నమవుతుంది. ఫలితంగా బ్రెడ్ గట్టిపడుతుంది, తినడానికి అనర్హంగా మారుతుంది. ఇలాంటి బ్రెడ్‌ను తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Mohammed Shami: షమీ కి శాపం లా మారిన గాయం.. ఎప్పుడు తిరిగొచ్చెనో?
చపాతీ పిండి కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. దీనిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే పిండి పులిసిపోయే ప్రమాదం ఉంది. పులిసిన పిండితో తయారు చేసిన చపాతీలు తినడం వల్ల గ్యాస్, అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే, టమాటలను కూడా ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి ఆకృతి మారిపోతుంది. టమాట సొంపుతనాన్ని కోల్పోతాయి, రుచి తగ్గుతుంది. టమాటలను గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడం ఉత్తమం.
మిగిలిన నూనెలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి గట్టిపడతాయి, పోషకాలు తగ్గిపోతాయి. ఇలాంటి నూనెలను వాడడం ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఫ్రిజ్‌లో దుర్వాసన పెరుగుతుంది. అలాగే, ఫ్రిజ్‌లో ఉన్న ఇతర ఆహార పదార్థాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఉల్లిపాయల పోషక విలువలు తగ్గిపోతాయి. అందుకే, ఉల్లిపాయలను చల్లని గది ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణ ఫ్రిజ్ వాడకంతో మీ ఆరోగ్యాన్ని హాని చేసుకోవడం మానుకోండి. పండ్లు, కూరగాయలు, బ్రెడ్, నూనెల వంటి వాటిని ఫ్రిజ్‌లో ఉంచే ముందు వీటిపై సరైన సమాచారం తెలుసుకోవడం అవసరం. ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.