Baahubali Stars: మళ్ళీ బాహుబలి కాంబో.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాలీవుడ్ దర్శకుడు!!
Baahubali Stars: బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్, రానా ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ లు గా నిలిచారు. హీరోగా ప్రభాస్, విలన్ గా రానా పోషించిన పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో బాహుబలి చిత్రానికి వచ్చిన బజ్‌లో విశేషమైనది. ఈ విజయం తరువాత కూడా, ప్రభాస్-రానా కాంబినేషన్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరిగాయి. కానీ, కథ మరియు డేట్స్ సమస్యల కారణంగా ఈ కలయిక తిరిగి కార్యరూపం దాల్చలేదు.
Baahubali Stars Prabhas and Rana Reunite
ఈ మెజిక్ కాంబోను మళ్లీ తెరపైకి తీసుకురావడంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ముందడుగు వేశారు. ప్రస్తుతం ప్రభాస్ లీడ్ రోల్‌లో సినిమా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ వర్మ, మొదట ఈ చిత్రంలో విలన్ పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను అనుకున్నారని టాక్. కానీ ఇప్పుడు ఆ పాత్రకు రానాను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభాస్-రానా కాంబినేషన్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ కాబట్టి, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి కలిగే అవకాశం ఉంది.
మేకర్స్ అభిప్రాయం ప్రకారం, సౌత్ మార్కెట్ మీద అధికంగా ఫోకస్ చేయడం వలన, ప్రభాస్ మార్కెట్ రేంజ్‌తో పాటు రానా ఇమేజ్ కలిస్తే, సినిమా కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు మరియు రానా అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ స్క్రీన్ మీద క్రియేట్ చేసిన మ్యాజిక్, ఈ సినిమాతో మరింత పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రం సాధారణ కథ కాకుండా, వండర్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే, తెలుగు సినిమాకు మళ్లీ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుందని అన్తునంరు. మరి బాహుబలి కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.