Pakistan: పాక్ జట్టు నుంచి బాబర్, రిజ్వాన్ ఔట్ ?
Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ జట్టు ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బాబర్ అజామ్, పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ లను టి20 నుంచి తప్పించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక వాళ్ల స్థానంలో… యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది.

Babar-Rizwan dropped for T20Is with Agha captain
ఈ నెల 16వ తేదీ నుంచి న్యూజిలాండ్ తో టి20 లు, వన్డే మ్యాచ్ లు ఆడనుంది. అయితే ఇందులో టి20 కెప్టెన్ గా సల్మాన్ అఘా ను చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో రిజ్వాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కానీ వన్డే జట్టుకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మొత్తానికి టి20 జట్టు నుంచి రిజ్వాన్ అలాగే బాబర్ ఇద్దరు వైదొలిగారు.
పాకిస్థాన్ టీమ్స్
పాకిస్థాన్ టీ20 జట్టు: హసన్ నవాజ్, ఒమైర్ యూసుఫ్, మహ్మద్ హరీస్, అబ్దుల్ సమద్, సల్మాన్ అఘా (కెప్టెన్), ఇర్ఫాన్ నియాజీ, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది, జహందాద్ ఖాన్, మహ్మద్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, ఉహ్మద్ ఖాన్, సుఫియాన్, సుఫియాన్ ఖాన్
పాకిస్థాన్ వన్డే జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావేద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, ఇర్ఫాన్ షాహిర్, తాయాన్ నియాజీ, తాయాన్ నియాజీ, నసీమ్.