Balakrishna: ఇంటికి పిలిచి మరిఎన్టీఆర్ ను అవమానించిన బాలయ్య.. ఆరోజు ఎన్టీఆర్ కంట్లో కన్నీళ్లే..!

Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఫ్యామిలీలో నందమూరి ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంటుంది. అన్న ఎన్టీఆర్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నందమూరి హీరోలు ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు. తర్వాత ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ గా ఎదిగారు. కేవలం తెలుగు ఇండస్ట్రీ పరిధిలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సాధించారు. అలాంటి ఎన్టీఆర్ ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు, ఎన్నో అవమానాలు కూడా పడ్డారట.
Balakrishna called home and insulted NTR
ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన బాబాయి బాలకృష్ణ ఆయనను అసలు ఆదరించలేదట. అంతేకాదు ఎన్నోసార్లు అవమానపరిచారని కూడా అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ తన తల్లితో కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు బాలకృష్ణ వారిని ఫంక్షన్ కు రావద్దని డైరెక్టుగా చెప్పారట. దీంతో ఎంతో బాధపడ్డ ఎన్టీఆర్ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారట. ఎంతో కసి పెంచుకున్న ఎన్టీఆర్ ఎవరైతే నన్ను అవమానించారో వాళ్ళ దగ్గరే నేను ఎదగాలి అనుకున్నారట. సినిమాల్లో ఎంతో కష్టపడుతూ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..(Balakrishna)
Also Read: NTR: నగలతో పారిపోయి వచ్చి ఎన్టీఆర్ తో పెళ్లి..ఈ షాకింగ్ విషయం మీకు తెలుసా.?
అయితే ఎన్టీఆర్ స్టార్ గా ఎదిగక ముందు చాలా సమయాల్లో బాలకృష్ణ ఆయనను బాగా తిట్టారని, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా అవమానపరిచారని అప్పట్లో ఒక జర్నలిస్టు వార్త రాశారు.. ఎన్టీఆర్ కి ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత స్టార్ డం వచ్చిందో అప్పటినుంచి మా హీరో మా నందమూరి హీరో అని చెప్పుకుంటూ వస్తున్నారని, అలా అవసరం ఉంటే దగ్గరికి వస్తూ, అవసరం లేకుంటే దూరం కొడుతూ బాలకృష్ణ ఎప్పుడు ఎన్టీఆర్ ను చులకనగానే చూస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఇక మొన్నటి ఎలక్షన్స్ సమయంలో కూడా ఎన్టీఆర్ పై బాలకృష్ణ కాస్త విభేదమే చూపించినట్టు కూడా అర్థమవుతుంది. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో రావడంతో నందమూరి అభిమానులు మాత్రం వారి మధ్య అలాంటిదేమీ లేదని, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారని కామెంట్లు పెడుతున్నారు.(Balakrishna)