Daku Maharaj: బాలకృష్ణ డాకూ మహారాజ్ లోని ప్లస్ మైనస్ లు..?

Daku Maharaj: నందమూరి బాలయ్య కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతున్నటువంటి హీరో. ఇప్పటికి ఆరు పదుల వయసు దాటిన కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాల్లో దూసుకుపోతున్నారు. అలాంటి బాలయ్య హీరోగా చేసిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి బరిలో ఇతర సినిమాలతో పోటీ పడుతుందని చెప్పవచ్చు. జనవరి 12న రిలీజ్ అయినటువంటి ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

Balakrishna Daku Maharaj plus and minuses.

Balakrishna Daku Maharaj plus and minuses.

ఇప్పటికే డాకు మహారాజ్ మూవీకి సంబంధించి ప్రీమియర్ షోలు అర్ధరాత్రి పడ్డాయి. సినిమా చూసి బయటకు వచ్చిన వారంతా అద్భుతమైన సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ బాబి చక్కని సినిమా సంక్రాంతి కానుకగా మాకు అందించారని బాలయ్య అభిమానులు సంబరపడిపోతున్నారు.. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య సరసాన నటించిన ప్రగ్యా జైస్వాల్ నటన మరింత అమోఘం. అలాగే బాలీవుడ్ డ్యూటీ ఊర్వసి స్పెషల్ సాంగ్ లో అదరగొట్టేసింది.(Daku Maharaj)

Also Read: Daku Maharaj: డాకూ మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. నట విశ్వరూపం చూపించిన బాలయ్య.?

ఈ సినిమా కథ విషయానికొస్తే మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రానికి బాలకృష్ణ నటన బాగా కలిసి వస్తుంది. ఆయన చేసే యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. అయితే రొటీన్ స్టోరీ అయినా కానీ కళ్ళు చెదిరే ఎలివేషన్స్, మ్యూజిక్, ఫ్యామిలీ సెంటిమెంట్, అద్భుతంగా రక్తి కట్టించారు. ఇక డాకు మహారాజు సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ అని చెప్పవచ్చు.. ప్రస్తుతం సంక్రాంతి బరిలో నిలిచినటువంటి గేమ్ చేంజర్ మూవీ కంటే ‘డాకు మహారాజు’ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.. మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చని అంటున్నారు..(Daku Maharaj)

Balakrishna Daku Maharaj plus and minuses.

ప్లస్ పాయింట్స్:
బాలయ్య నటన
సినిమాటోగ్రఫీ
బిజిఎం
ఐటమ్ సాంగ్
ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
క్లైమాక్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *