Soundarya: సౌందర్యతో బాలకృష్ణకి గొడవలా.. సినిమాలో నటించమంటే అలా చేసి.?
Soundarya: బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తిరుగులేని స్టార్ గా ఎదిగారు. అలాంటి ఈయన 6పదుల వయస్సులో కూడా సినిమాల్లో దూసుకుపోతూ అదరహో అనిపిస్తున్నారు. అలాంటి బాలకృష్ణతో నటించాలంటే ఏ హీరోయిన్ కైనా అదృష్టం ఉండాలి. కానీ ఆ స్టార్ హీరోయిన్ మాత్రం బాలకృష్ణతో సినిమా అంటే నో చెప్పిందట. దీనికి కారణం ఏంటి వివరాలు ఏంటో చూద్దాం..
Balakrishna had a fight with Soundarya
బాలకృష్ణ వివి వినాయక్ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా థియేటర్లలో హిట్టు కొట్టకపోయినా కానీ ప్రేక్షకుల మదిని దోచుకుందని చెప్పవచ్చు. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే చెన్నకేశవరెడ్డి.. అప్పట్లో ఈ సినిమా చిరంజీవి ఇంద్ర సినిమాకు పూర్తిగా వచ్చింది. కానీ ఇంద్రాను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయిన కొన్ని థియేటర్లలో వంద రోజులు ఆడింది. (Soundarya)
Also Read: Spirit Movie: ఇంటర్నేషనల్ లెవెల్ కాస్టింగ్.. ‘స్పిరిట్’ లో డాన్ లీ పాత్ర పై క్లారిటీ!!
అయితే ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా చేస్తే ఆయనకు జోడిగా శ్రీయ, టాబు నటించారు.. ఇందులో బాలకృష్ణ డబుల్ యాక్షన్ చేశారు. అయితే బాలకృష్ణ తండ్రి పాత్రకు జోడీగా అప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్యను తీసుకోవాలనుకున్నారట.. ఆమెను సంప్రదించి కథ కూడా చెప్పారట.. కథ మొత్తం విన్నా ఆమె అలాంటి ఓల్డ్ పాత్రలో నేను నటించలేను.
ఒకవేళ ఆ పాత్ర చేస్తే నాకు తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తాయని ఆమె చెప్పిందట.. కాబట్టి బాలకృష్ణతో ఆ పాత్ర చేయడానికి సౌందర్య ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ విధంగా సౌందర్య అప్పట్లో బాలకృష్ణతో సినిమా అంటి రిజెక్ట్ చేయడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Soundarya)