Urvasi Rautela: బాలకృష్ణ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం.. ఓ ‘గే’ తో పెళ్లి.?


Urvasi Rautela: ఏంటి ఊర్వశి రౌటేలా నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుందా.. ఎందుకు అలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంది..ఓ గే ని నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా సౌత్ లో ఐటమ్ సాంగ్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కీ రోల్స్ కూడా చేస్తుంది. అలా బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో పాటు కీరోల్ కూడా పోషించింది.

Balakrishna heroine Urvasi Rautela shocking decision to marry a gay

Balakrishna heroine Urvasi Rautela shocking decision to marry a gay

ఇక ఈ సినిమాలోని దబిడి దిబిడే అనే సాంగ్ తో చాలా నెగెటివిటీ సంపాదించుకున్నప్పటికీ ఫేమస్ మాత్రం అయ్యింది. ఎంత నెగెటివిటీ సంపాదించుకుంటే అంత ఫేమస్ అవుతారు అన్నట్లుగా ఈ హీరోయిన్ నెగిటివిటీతోనే పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, సెలబ్రిటీ అయినా ఒర్రీని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ లతో ఎక్కువ కనిపించే ఒర్రీ అంటే తెలియని వారు ఉండరు. (Urvasi Rautela)

Also Read: Balakrishna: ఆ సినిమా డిజాస్టర్ అంటూ బాలకృష్ణను అవమానించిన నిర్మాత.?

ఈయనతో చాలామంది హీరోయిన్లు ఫోటోలు దిగుతూ పబ్బులకు పార్టీలకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒర్రిని చాలామంది గే అని అంటూ ఉంటారు.కానీ ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియదు. ఎందుకంటే ఆయనని గే అని అనడానికి కారణం ఆయన ప్రవర్తించే ప్రవర్తనే..అయితే తాజాగా ఊర్వశి రౌటేలా తన సోషల్ మీడియా ఖాతాలో నీ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది.అయితే ఒర్రి గురించి పెట్టిన ఈ పోస్టు క్షణాల్లో వైరల్ అవ్వడంతో దీనిపై రియాక్ట్ అయిన ఒర్రీ..

Balakrishna heroine Urvasi Rautela shocking decision to marry a gay

నీ పెళ్లి కాదు మన పెళ్లి అని అంటూ రిప్లై ఇవ్వడంతో చాలామంది నెటిజన్లు ఏంటి బాలకృష్ణ హీరోయిన్ ఊర్వసి రౌటేలా నిజంగానే ఓ గేని పెళ్లి చేసుకోబోతుందా.. ఇంత పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకుంది అని కామెంట్లు పెడుతున్నారు.కానీ ఇందులో ఉన్న అసలు నిజం ఏంటంటే.. నీ పెళ్లి కాదు మన పెళ్లి అని ఒర్రీ అనడానికి కారణం ఇద్దరికీ పెళ్లి కాలేదు కాబట్టి ఇద్దరు పెళ్లిళ్ల గురించి వెయిట్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఆయన రిప్లై ఇచ్చాడు.(Urvasi Rautela)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *