Balakrishna: డైరెక్టర్ తో గొడవ..షూటింగ్ నుండి వెళ్లిపోయిన బాలకృష్ణ..?

Balakrishna: బాలకృష్ణ ఈయన పేరు చెప్తే ఇప్పటికి వారి అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయి. ఆరు పదుల వయస్సు దాటినా కానీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అలాంటి బాలకృష్ణ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులతో సినిమాలు చేశారు. ఆయనకు అద్భుతమైన హిట్లు ఇచ్చిన దర్శకుడు ఎవరయ్యా అంటే బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక మాస్ చిత్రాలు వచ్చి బంపర్ హిట్ అయ్యాయి.
Balakrishna left the shooting
ఇక బోయపాటి డైరెక్టర్ గా ఉన్నారు అంటే బాలకృష్ణకు కథ చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్ షూటింగ్లోనే పాల్గొంటారు. అంత నమ్మకం కలిగినటువంటి డైరెక్టర్. అలాంటి బోయపాటి శ్రీను మరియు బాలక్రిష్ణ కాంబినేషన్ లో అఖండ సినిమా వచ్చి ఎలాంటి హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా అఖండ2 సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ వారు ప్రకటించారు. (Balakrishna)
Also Read: Ramyakrishna: ఆ హీరోయిన్ కి వ్యతిరేకంగా రమ్యకృష్ణ మూవీ.?
ఇదే తరుణంలో దర్శకుడితో గొడవ జరిగి బాలకృష్ణ షూటింగ్ బై కట్ చేసి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అయితే వీరిద్దరి కాంబోలో వస్తున్నటువంటి అఖండ 2 2025 దసరా సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అఖండ 2 సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయిందని, బాలకృష్ణ బోయపాటి మధ్య చాలా విభేదాలు చోటుచేసుకున్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

దీనికి కారణం అఖండ2 సినిమా బోయపాటి సరిగ్గా తీయలేదని, అలా ఎందుకు చేసావని బాలకృష్ణ ప్రశ్నించినందుకు ఇద్దరు మధ్య గొడవ జరిగినట్టు ప్రచారం అవుతోంది. దీంతో బాలకృష్ణ అభిమానులు కంగారుపడుతున్నారు. ఇదే తరుణంలో చిత్ర నిర్మాతలు తాజాగా స్పందించి దీనిపై క్లారిటీ ఇచ్చారు. సినిమాపై కొంతమంది తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నారని అందులో నిజం లేదని సినిమా అద్భుతంగా షూటింగ్ జరుగుతోందని తెలియజేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని వారన్నారు.(Balakrishna)