Balakrishna: ఆ హీరోయిన్ ని టార్చర్ చేసిన బాలకృష్ణ.. షూటింగ్లోనే ఏడిపించి.?
Balakrishna: ఆయన అరిస్తే చాలు జనాలంతా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆగిపోతారు.. ఆయన ఒక్క అడుగు వేస్తే సుమోలన్నీ గాల్లో ఎగురుతాయి.. ఒంటి చేత్తో ట్రైన్ ను కూడా ఆపగల మహా బలశాలి.. ఇంతకీ ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఆయనేనండి మన బాలయ్య.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది బాలకృష్ణ మాత్రమే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.

Balakrishna who tortured the heroine
అలాంటి బాలకృష్ణ చాలా కోపిష్టి అని కొంతమంది అనుకుంటారు. ఆయనతో పని చేసిన ఎవరైనా సరే ఆయన కోపం వెనుక ఎంతో ఆలోచన, మంచి మనసు ఉంటుందని చెబుతుంటారు. అలాంటి బాలక్రిష్ణ ఒక సినిమా షూటింగులో హీరోయిన్ దారుణంగా ఏడిపించారట. దీనికి కారణం ఏంటి వివరాలు చూద్దాం.. హీరోయిన్ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలతో నటించడమే కాకుండా బాలకృష్ణతో కూడా “విజయేంద్రవర్మ” సినిమాలో చేశారు.(Balakrishna)
Also Read: Raviteja:పెళ్ళిలో రవితేజ కాళ్లు కడిగిన నటుడు..?
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సాంగ్ షూట్ చేస్తుంటే డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆ సాంగ్ లో ఒక మూమెంట్ చేశారట. ఇక డైరెక్టర్ కట్ చెప్పగానే లయ ముందుకు బాలకృష్ణ వెనక్కి జరిగారట. కానీ లయ తన వెనకాల బాలకృష్ణ ఉన్నాడని చూసుకోకుండా ఒక అడుగు వెనక్కి వేసి బాలకృష్ణ కాలు తొక్కేసిందట. దీంతో బాలకృష్ణ గట్టిగా అరిచి నా కాలు తొక్కుతావా ప్యాకప్ అంటూ షూటింగ్ మొత్తం ఆపేశారట.

దీంతో లయ నావల్ల ప్యాకప్ చెపుతున్నారని బాధపడుతూ దారుణంగా ఏడ్చి సారీ సార్, సారీ సార్ అంటూ మాట్లాడిందట. వెంటనే బాలకృష్ణ నవ్వుతూ ఊరికే అలా జోక్ చేశా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూశా అన్నారట.. దీంతో షూటింగ్ సెట్లో ఒక్కసారి అలజడి ఏర్పడి ఆ తర్వాత నవ్వులు పూశాయని, లయ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అని ఆయనను దగ్గర నుంచి చూస్తేనే ఆయన ఏంటో అర్థం అవుతుందని చెప్పుకొచ్చింది.(Balakrishna)